–శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి
CMRF Scheme : ప్రజాదీవెన నల్గొండ : సీఎం ఆర్ ఎఫ్ పథకం నిరుపేద ప్రజలకు వరం లాంటిదని శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి అన్నారు. గురువారం జిల్లా కేంద్రంలోని తన క్యాంపు కార్యాలయంలో వివిధ అనారోగ్యా కారణాల రిత్య వివిధ హాస్పిటల్ లో చికిత్స పొందుతున్న
37 మందికి 14 లక్షల 66 వేల 500 రూపాయల సీఎంఆర్ఎఫ్ చెక్కులను పంపిణీ చేసి మాట్లాడారు.ముఖ్యమంత్రి సహాయనిధి నుంచి సంవత్సరానికి దాదాపు 1000 కోట్లకు పైన రాష్ట్ర ప్రభుత్వం నిధులు మంజూరు చేస్తూ నిరుపేదలకు ఆసరాగా నిలుస్తుందన్నారు.