Cobra On Ganesh Statue: ప్రజా దీవెన, జగిత్యాల: గణపతి నవరాత్రి ఉత్సవాల సందర్భంగా జగిత్యాల (Jagtial) పట్టణంలో ఒక వింత చోటుచేసుకుంది. నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా సోమవారం పూజలు అందుకుంటున్న గణపతి మెడలోకి ఒక నాగుపాము (King Cobra) చేరి ఆభరణంగా మారింది. పట్టణంలోని వాణినగర్ లో త్రిశూల్ యూత్ (Trisul Youth) ఆధ్వర్యంలో 48 అడగుల భారీ గణేష్ విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. భారీ విగ్రహంతో పాటు చిన్న గణేశుని విగ్రహాన్ని ఏర్పాటు చేసి సోమవారం ఉదయం భక్తులందరూ (Devotees) పూజిస్తుండగా ఒక నాగు పాము వచ్చి పూజలు అందుకుంటున్న గణపతి మెడలోకి చేరింది.
శివునికి ప్రీతిపాత్రమైన సోమవారం రోజున శివుని మెడలో ఆభరణంగా ఉండే నాగుపాము ఆయన కుమారుడైన గణపతి మెడలోకి వచ్చి చేరిందంటూ భక్తులు విశేషంగా చెప్పుకుంటూ ప్రత్యేక పూజలు నిర్వహించారు.