Collectertripathi : ప్రాథమిక వైద్యఆరోగ్య కేంద్రాల్లో ప్రసవాలు చేయాలి
-- పిహెచ్సి ఆకస్మిక తనిఖీలో కలెక్టర్ ఇలా త్రిపాఠి
ప్రజాదీవెన, నల్గొండ: ప్రాథమిక వైద్య ఆరోగ్య కేంద్రాలలో ప్రసవాలు చేయాలని జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి అన్నారు. మంగళవారం ఆమె నల్గొండ జిల్లా, తిప్పర్తి మండల కేంద్రంలోని ప్రాథమిక వైద్య ఆరోగ్య కేంద్రాన్ని ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఆసుపత్రి వైద్యాధికారులు, సిబ్బంది హాజరు రిజిస్టర్ ను పరిశీలించి నూటికి నూరు శాతం హాజ రు ఉండడం పట్ల సంతృప్తి వ్యక్తం చేశారు. ఆసుపత్రి ద్వారా అంది స్తున్న వైద్య సేవలు, సమస్యలను ప్రాథమిక వైద్య ఆరోగ్య కేంద్రం వైద్యురాలు డాక్టర్ మమత ద్వారా అడిగి తెలుసుకున్నారు.
పి హెచ్ సి బిల్డింగ్ పురాతనమైందని, కొత్త భవనం మంజూరు చే యాలని, అలాగే ప్రస్తుతం ఉన్న ప్యూరిఫైయర్ తాగునీటి యంత్రం సరిగా పనిచేయడం లేదని, డెలివరీ చేసేందుకు టేబుల్లు, ఆటో క్లేవ్స్ తదితర పరికరాలు కావాలని డాక్టర్ మమత జిల్లా కలెక్టర్ కు విజ్ఞప్తి చేయగా, జిల్లా కలెక్టర్ వాటిని మంజూరు చేసేందుకు అంగీకరించా రు. ప్రాథమిక వైద్య ఆరోగ్య కేంద్రాల ద్వారా డెలివరీలతో పాటు, పేద ప్రజలకు ఇబ్బంది లేకుండా వైద్య సేవలను అందించాలని జిల్లా కలె క్టర్ డాక్టర్ కు, సిబ్బందికి సూచించారు.
అనంతరం జిల్లా కలెక్టర్ మండల కేంద్రంలో ఉన్న తెలంగాణ మో డల్ స్కూల్ ను, లైబ్రరీని పరిశీలించారు. కాగా మోడల్ స్కూల్ లో డిజిటల్ లైబ్రరీ ఏర్పాటు విషయమై ఆమె మోడల్ స్కూల్ ను సంద ర్శించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ విద్యార్థినిలతో ముఖాముఖి మాట్లాడి ఎలా చదువుతున్నారని? భోజనం బాగుందా? అన్ని సౌక ర్యాలు సౌకర్యాలు బాగున్నాయా? ఏమైనా ఇబ్బందులు ఉన్నాయా? అని ప్రశ్నించారు.
విద్యార్థులకు గుణాత్మక విద్యను అందించాలని, అలాగే నాణ్యమైన భోజనం ఇవ్వాలని, ఏవైనా సమస్యలుంటే తన దృష్టికి తీసుకు రా వాలని ప్రిన్సిపాల్ కు సూచించారు. జిల్లా కలెక్టర్ వెంట జిల్లా పం చాయతీ అధికారి వెంకయ్య, మండల అధికారులు తదితరులు ఉన్నారు.