Welcome To Praja Deveena News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alert at prajadeveena.com

Residential School Inspection : రెసిడెన్షియల్ పాఠశాలలను ఆకస్మిక తనిఖీ చేసిన కలెక్టర్

–మౌలిక వసతులను పరిశీలన

–పలు సౌకర్యాలు కల్పించాలని కలెక్టర్ ను కోరిన ప్రిన్సిపాల్ లు

Residential School Inspection : ప్రజాదీవెన నల్గొండ :  రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి శుక్రవారం జిల్లాలో ఉన్న పలు సంక్షేమ రెసిడెన్షియల్ పాఠశాలలను, కళాశాలలను సందర్శించి రెసిడెన్షియల్ పాఠశాలలు, కళాశాలల్లో ఉన్న మౌలిక సదుపాయాల వివరాలను అడిగి తెలుసుకున్నారు. సాంఘిక సంక్షేమ, వెనుకబడిన తరగతుల సంక్షేమ, గిరిజన సంక్షేమ, మైనార్టీ సంక్షేమ, బాలుర, బాలికల రెసిడెన్షియల్ పాఠశాలలు, కళాశాలలను ఆమె ప్రత్యక్షంగా సందర్శించి ఆయా పాఠశాలలు, కళాశాలలో ప్రస్తుతం ఉన్న మౌలిక సదుపాయాలపై ఆరా తీశారు. అంతేకాకుండా కావలసిన మౌలిక సదుపాయాల వివరాలను సేకరించారు.


ఇందులో భాగంగా జిల్లా కలెక్టర్ ముందుగా గుండ్లపల్లి( డిండి) మండల కేంద్రంలో ఉన్న తెలంగాణ సాంఘిక సంక్షేమ బాలికల రెసిడెన్షియల్ పాఠశాలను సందర్శించి మౌలిక సదుపాయాల వివరాలు కనుకున్నారు. ఆ తర్వాత చందంపేట గిరిజన బాలికల మినీ గురుకులాన్ని సందర్శించి అక్కడ కూడా వివరాలను అడిగి తెలుసుకున్నారు. ఆ తర్వాత దేవరకొండలో ఉన్న తెలంగాణ గిరిజన బాలికల గురుకుల ప్రతిభా పాఠశాల/కళాశాల, గిరిజన బాలుర గురుకుల పాఠశాల/ కళాశాల, కొండభీమనపల్లి వద్ద ఉన్న మైనార్టీ రెసిడెన్షియల్ బాలుర పాఠశాల/ కళాశాల, అలాగే తెలంగాణ బీసీ రెసిడెన్షియల్ పాఠశాలల్లో మౌలిక సదుపాయాలు, అవసరమైన మౌలికవసతులను పరిశీలించారు. ఆ తర్వాత కొండమల్లేపల్లిలో సైతం తెలంగాణ సాంఘిక సంక్షేమ బాలికల గురుకుల పాఠశాలలో, తెలంగాణ గిరిజన సంక్షేమ రెసిడెన్షియల్ పాఠశాలలో, మహాత్మ జ్యోతిబాపూలే బీసీ రెసిడెన్షియల్ పాఠశాలలో మాలిక సదుపాయాలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం నల్గొండ జిల్లా కేంద్రంలో సాంఘిక సంక్షేమ బాలుర, బాలికల రెసిడెన్షియల్ పాఠశాల/ కళాశాలల్లో, బిసి గర్ల్స్ హాస్టల్, జీవీ గూడెం లో ఉన్న సాంఘిక సంక్షేమ బాలికల రెసిడెన్షియల్ పాఠశాలలను సందర్శించి అక్కడ ఉన్న మౌలిక సదుపాయాలపై ఆరా తీశారు. కాగా ఆయా పాఠశాలలు, కళాశాలల్లో అవసరమైన అదనపు బ్లాకులు, విద్యార్థులకు టాయిలెట్లు, బాత్రూంలు, డ్యూయల్ డేస్కులు, తరగతి గదులు, తాగునీటి సౌకర్యం, మంచాలు,తదితర అవసరాలను అడిగి వివరాలు సేకరించారు. ఈ సందర్భంగా ఆయా పాఠశాలల్లో తాగునీటి ఓహెచ్ఎస్ఆర్ లు కావాలని, అదనంగా టాయిలెట్ బ్లాకులు కావాలని, డార్మెటరీ కావాలని, కాంపౌండ్ వాల్, బాత్రూంలు, సోలార్ ఫెన్సింగ్, డ్యూయల్ డెస్కులు, రెసిడెన్షియల్ బ్లాక్లులు, మంచాలు కావాలని జిల్లా కలెక్టర్ తో ఆయా కళాశాలల, పాఠశాలల ప్రిన్సిపల్స్ తెలియజేశారు. జిల్లా కలెక్టర్ వెంట ఆయా పాఠశాలల/ కళాశాలల ప్రిన్సిపల్స్ తో పాటు, దేవరకొండ ఆర్ డి ఓ రమణారెడ్డి, సంబంధిత సంక్షేమ రెసిడెన్షియల్ పాఠశాలలు, కళాశాలల రీజినల్ కో ఆర్డినేటర్లు, తదితరులు ఉన్నారు.