Collector Inspects : ప్రజాదీవెన నల్గొండ : పదో తరగతి పరీక్షల లో భాగంగా శనివారం జిల్లా కలెక్టర్ హాలియ మండల కేంద్రంలోని కృష్ణవేణి ఉన్నత పాఠశాలలో ఏర్పాటు చేసిన పదవ తరగతి పరీక్ష కేంద్రాన్ని జిల్లా ఎస్పీ శరత్చంద్ర పవర్ తో కలిసి తనిఖీ చేశారు. ఈ కేంద్రంలో విద్యార్థులకు ఏర్పాటు చేసిన సౌకర్యాలు, శనివారం పరీక్షకు హాజరైన విద్యార్థుల వివరాలు అన్నింటిని ఎంఈఓ, చీఫ్ సూపరింటిండెంట్ ల ద్వారా అడిగి తెలుసుకున్నారు. జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవర్ స్థానిక పోలీసులతో మాట్లాడుతూ పరీక్ష కేంద్రాల వద్ద భద్రతను పకడ్బందీగా నిర్వహించాలని, ఎట్టి పరిస్థితులలో ఇతరులను పరీక్ష కేంద్రంలోకి అనుమతించవద్దని, పరీక్ష కేంద్రంలోకి సెల్ ఫోన్లు అనుమతి లేదని చెప్పారు.
పరీక్ష కేంద్రాల పరిధిలో జిరాక్స్ కేంద్రాలు మూసి ఉంచాలని,పోలీస్ ఎప్పటికప్పుడు అప్రమత్తంగా ఉండి పరీక్షలు సవ్యంగా జరిగేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.
మిరియాల గూడ సబ్ కలెక్టర్ నారాయణ్ అమిత్, మిర్యాలగూడ డి ఎస్ పి తదితరులు జిల్లా కలెక్టర్ వెంట ఉన్నారు