–స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ గా రాజ్ కుమార్
Collector Raj Kumar : ప్రజాదీవెన నల్గొండ :నల్గొండ జిల్లా అదనపు కలెక్టర్ జే. శ్రీనివాస్ నెల రోజులపాటు సెలవులో వెళ్లడంతో రెవెన్యూ అదనపు కలెక్టర్ పూర్తి అదనపు బాధ్యతలను మిర్యాలగూడ సబ్ కలెక్టర్ నారాయణ అమిత్ కు, స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ బాధ్యతలను గృహ నిర్మాణ శాఖ పిడి రాజకుమార్ కు అప్పగిస్తూ జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి ఆదేశాలు జారీ చేశారు.
జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు గురువారం మిర్యాలగూడ సబ్ కలెక్టర్ నారాయణ అమిత్ జిల్లా కలెక్టర్ కార్యాలయంలో రెవెన్యూ అదనపు కలెక్టర్ గా బాధ్యతలను స్వీకరించారు. అలాగే స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ గా గృహ నిర్మాణ శాఖ పీడి రాజకుమార్ పూర్తి అదనపు బాధ్యతలను స్వీకరించారు.