— నల్లగొండ జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి
Collector Tripathi : ప్రజా దీవెన, వాడపల్లి: మహాశివరాత్రి సందర్భంగా దామర చర్ల మండలం వాడపల్లి మీనాక్షి అగస్తీశ్వర స్వామి దేవాలయంలో అవసరమైన అన్ని ఏర్పాటు చే యాలని జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి ఆదేశించారు. బుధవారం ఆమె వాడపల్లి మీనాక్షి అగస్తీశ్వర స్వా మి ఆలయాన్ని సందర్శించారు. ప్రసిద్ధ శైవ క్షేత్రాలలో ఒకటైన మీ నాక్షి అగస్తేశ్వర స్వామి ఆలయా నికి మహాశివరాత్రి సందర్భంగా పెద్ద సంఖ్యలో భక్తులు వస్తారని, అందువల్ల ఏర్పాటల్లో ఎలాంటి లోటుపాట్లు లేకుండా చూసుకోవా లని, భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా చూడాలని ఆమె ఆదేశించారు. ముఖ్యంగా కృష్ణా నదిలో లోతట్టు ప్రాంతంలో నీరు ఉన్నందున భక్తులకు స్నానం ఆచరించేందుకు ఇబ్బంది అవుతుందని, అందువల్ల షవర్ బాత్ ఏర్పాటు చేయాలని ఆర్డబ్ల్యూఎస్ అధికారులను ఆదేశించారు. అలాగే తాగునీటి కొరత లేకుండా చూడాల్సిందిగా ఆమె ఆదేశించారు. అంతేకాక ఎప్పటికప్పుడు ఆలయ పరిసరాలు , గ్రామంలో పరిశుభ్రంగా ఉండేలా చూడాలని జిల్లా పంచాయతీ అధికారి వెంకయ్య ను ఆదేశించారు. భక్తులకు అవసరమైన తాగునీటితోపాటు, వైద్య శిబిరం ఏర్పాటు చేయాలని, పోలీస్ బందోబస్తు, పార్కింగ్ అన్ని సదుపాయాలు కల్పించి ఇబ్బందులు లేకుండా చూడాలని ఆమె చెప్పారు.
అనంతరం జిల్లా కలెక్టర్ కస్తూర్బా గాంధీ బాలిక విద్యాలయాన్ని సందర్శించి విద్యార్థినిలతో ముఖాముఖి మాట్లాడారు. కస్తూరిబా గాంధీ బాలిక విద్యాలయంలో పరిసరాలను ,వంటగదిని, తరగతి గదులను, వాష్ రూమ్ మరుగుదొడ్లు పరిశీలించారు .అంతేకాక నూతనంగా నిర్మిస్తున్న అదనపు తరగతి గదులను తనిఖీ చేశారు. నెలలోపు అదనపు తరగతి గదుల నిర్మాణాన్ని పూర్తిచేయాలని ఇంజనీరింగ్ అధికారులను ఆదేశించారు. అంతేకాక దామరచర్ల మండల కేంద్రంలోని శ్రీలక్ష్మి పూజిత ఫర్టిలైజర్ దుకాణాన్ని ఆకస్మికంగా తనిఖీ చేసి ఎరువుల దుకాణంలో యూరియా సరఫరా ఆన్లైన్ వివరాల నమోదు, తదితర వివరాలను తనిఖీ చేసి వ్యవసాయ అధికారితో మాట్లాడారు. యూరియాకు ఎలాంటి కృత్రిమ కొరత సృష్టించకుండా చూడాలని, ఎప్పటికప్పుడు ఎరువుల దుకాణాలను తనిఖీ చేయాలని ఆమె ఆదేశించారు .
అనంతరం జిల్లా కలెక్టర్ తహసిల్దార్ కార్యాలయాన్ని సందర్శించి ధరణి రికార్డులను పరిశీలించారు. అంతేకాక రైతు భరోసా కింద నమోదు చేస్తున్న వివరాలను ఆమె పరిశీలించారు. రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు వ్యవసాయ యోగ్యం కానీ సబ్ డివిజనల్ సర్వే నంబర్ల వివరాలను ఆన్లైన్లో పొందుపరచాలని చెప్పారు. రైతు భరోసా, ఎరువుల సరఫరా ప్రత్యేకించి యూరియా సరఫరాకు సంబంధించి మండల వ్యవసాయ అధికారి కార్యాలయంలో ఫిర్యా దుల విభాగాన్ని ఏర్పాటు చేయా లని ఆమె సూచించారు. మిర్యా లగూడ సబ్ కలెక్టర్ నారాయణ అమిత్, తహసిల్దార్ జవ హర్ లాల్ ,వాడపల్లి వెంకటేశ్వర స్వామి దేవాలయం ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ జ్యోతి ,అనువంశిక ధర్మ కర్త సిద్దయ్య, ఎంపీడీవో, మెడికల్ ఆఫీసర్ తదితరులు ఉన్నారు.