— నల్లగొండ జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి
Collector Tripathi : ప్రజా దీవెన, నల్లగొండ టౌన్: మహాశివరాత్రి సందర్భంగా నల్లగొం డ జిల్లా పానగల్ ఛాయా సోమేశ్వ ర స్వామి దేవాలయంలో ఈనెల 25 నుండి 27 వరకు నిర్వహించ నున్న బ్రహ్మోత్సవాలకు అవసర మైన అన్ని ఏర్పాట్లు చేయాలని జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి ఆదేశిం చారు.బ్రహ్మోత్సవాల ఏర్పాట్ల విష యమై మంగళవారం ఆమె ఛాయా సోమేశ్వర స్వామి దేవాలయాన్ని సందర్శించారు.బ్రహ్మోత్సవాలలో భక్తులకు ఎలాంటి అసౌకర్యం కల గకుండా చర్యలు తీసుకోవాలని, ముఖ్యంగా ఈ నెల 26 న శివ రా త్రి సందర్బంగా భక్తులకు ఇబ్బంది కలగకుండా తాగునీరు, అంబు లె న్స్, భారికేడింగ్, వైద్య శిబిరం ఏ ర్పాటు చేయాలని, అంబులెన్స్ ఏ ర్పాటు చేయాలని, నలుగురు డా క్టర్లను అంబులెన్స్ తో సహా సిద్ధం గా ఉంచాలని, తగినంత పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేయాలని, ముఖ్యంగా మహిళ కానిస్టేబుళ్లను ఎక్కువగా నియమించాలని, ప్రధా న రహదారి నుండి దేవాలయం వ రకు పూర్తిస్థాయిలో లైటింగ్ ఉండే లా చర్యలు తీసుకోవాలని, విద్యు త్ సరఫరాలో అంతరాయం లేకుం డా చూడాలని ఆదేశించారు.
వి ద్యుత్ అధికారులు విరిగిపోయి న,వంగిపోయిన విద్యుత్ స్తంభా లను సరిచేసి విద్యుత్తు వల్ల ప్రమా దం జరగకుండా ఆడిట్ నిర్వహిం చాలని చెప్పారు. కోనేటితోపాటు, దేవాలయానికి వచ్చే రహదారికి ఇరువైపులా భారీ కేడింగ్ చేయిం చాలన్నారు.అనంతరం జిల్లా కలె క్టర్ పక్కనే ఉన్న తాగునీటి శుద్ధి కేంద్రాన్ని తనిఖీ చేసి నల్గొండ పట్ట ణానికి సరఫరా చేస్తున్న తాగునీటి వివరాలు, నీటి శుద్ధి వివరాలను మిషన్ భగీరథ ఎగ్జిక్యూటివ్ ఇంజ నీర్ వంశీకృష్ణ ద్వారా అడిగి తెలు సుకున్నారు.ఆ తర్వాత డంపింగ్ యార్డ్ పక్కన ఉన్న జంతు జనన కేంద్రాన్ని సందర్శించి స్టీరిలైజేషన్ తదితర వివరాలను కనుక్కున్నా రు.నల్గొండ ఆర్డిఓ వై. అశోక్ రెడ్డి, డిఎస్పి శివరామిరెడ్డి, సీఐ రాఘ వేంద్రరావు, మున్సిపల్ కమిషనర్ సయ్యద్ ముసాబ్ అహ్మద్, ఆహార భద్రత అధికారి స్వాతి, తహసిల్దార్ శ్రీనివాస్, ఛాయా సోమేశ్వర దేవ స్థానం ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ బాల కృష్ణ తదితరులు ఉన్నారు.