Collector Tripathi : ప్రజా దీవెన, నల్లగొండ: 2025 -26 విద్యా సంవత్సరానికి గాను ఎస్సీ, ఎస్టీ, బిసి, జనరల్ గురుకులాలలో 5 వ తరగతిలో ప్రవేశానికి, అలాగే ఎస్సీ, ఎస్టీ గురుకులాలలో 6,7 8,9 తరగతులలో బ్యాక్ లాగ్ ఖాళీల ప్రవేశానికి ఆదివారం నిర్వహించిన టిజీ సెట్- 2025 ప్రవేశ పరీక్ష ప్రశాం తంగా ముగిసినట్లు జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి తెలిపారు.ఆదివారం ఆమె నల్గొండ జిల్లా కేంద్రంలోని చర్లపల్లి బైపాస్ వద్ద ఉన్న తెలం గాణ సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ పాఠశాల, కళాశా లలో నిర్వహిం చిన టి జి సెట్ ప్రవేశ పరీక్షను తని ఖీ చేశారు.
ప్రవేశ పరీక్షకు మొత్తం 12929 మందివిద్యార్థులను కేటా యించగా,పరీక్షకు 12,503 మంది విద్యార్థులు హాజరయ్యా రని, 426 మంది విద్యార్థులు గైర్ హాజరైనట్లు తెలిపారు. 96.71 శాతం విద్యార్థు లు పరీక్షకు హాజరైనట్లు జిల్లా కలెక్ట ర్ వెల్లడించారు. జిల్లా గృహ నిర్మా ణ శాఖ ప్రాజెక్ట్ డైరెక్టర్ రాజకు మార్ ,పాఠశాల ప్రిన్సిపాల్ తదిత రులు జిల్లా కలెక్టర్ వెంట ఉన్నారు.