Collector Tripathi : ప్రజా దీవెన, పీఏ పల్లి : భూ భారతి చట్టం గురించి ప్రతి ఒక్కరు తెలు సుకోవాల్సిన అవసరం ఉందని జి ల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి అన్నారు. శనివారం నల్గొండ జిల్లా పెద్ద అడిశ ర్లపల్లి మండల కేంద్రంలో భూ భార తి (భూమి హక్కుల చట్టం- 2025) పై ఏర్పాటు చేసిన అవగాహన స దస్సుకు ఆమె ముఖ్యఅతిథిగా హా జరై రైతులకు అవగాహన కల్పిం చారు.
భూమి ఉన్న రైతులు, లేని రైతులు సైతం భూ భారతి చట్టం గురించి తెలుసుకోవాల్సిన అవసరం ఉంద న్నారు. చట్టం ఇదివరకే అమల్లోకి వచ్చిందని, అయితే భూ భారతి పోర్టల్ మాత్రం జూన్ 2 నుంచి అ మలులోకి రానుందని తెలిపారు. ధరణిలో లేని అనేక వెసులుబాట్లు భూ భారతిలో ఉన్నాయని, ధరణి పోర్టల్ లో రికార్డులను సవరించే అవకాశం లేదని, భూ భారతి లో రికార్డులను సవరణ చేసుకోవచ్చని తెలిపారు. భూములపై జరిగిన లా వాదేవీలన్నింటిని ప్రతి సంవత్సరం డిసెంబర్ 31న సంబంధిత గ్రామ పంచాయతీ నోటీస్ బోర్డులో అం దరికీ తెలిసేలా ప్రచురించడం జరు గుతుందని చెప్పారు.
ధరణిలో అనుభవదారు కాలం లేదని, భూ భారతిలో అనుభవదా రుకు ప్రాధాన్యత ఉంటుందని చె ప్పారు. మోఖా మీద ఉన్న ప్రతి రై తుకు భూమీ పై హక్కు కల్పించే బాధ్యత రెవెన్యూ శాఖదని ఆమె స్పష్టం చేశారు.భూ భారతిలో త ప్పు చేస్తే ఉద్యోగులను ప్రభుత్వ స ర్వీస్ నుండి శాశ్వతంగా తొలగించే అధికారం చట్టంలో ఉందని వెల్లడిం చారు. అందువల్ల రైతులు భూ భా రతి చట్టంపై ఎలాంటి ఆపోహలు, అనుమానాలు పెట్టుకోవద్దని అ న్నారు. గతంలో సమస్య పరి ష్కారం కాక పోయిన అన్యాయా లు జరిగినా భూ భారతిలో సవ రించడం జరుగుతుందని తెలి పారు.
రెవెన్యూ అదనపు ఇంచార్జ్ కలెక్టర్ మరియు మిర్యాలగూడ సబ్ కలె క్టర్ నారాయణ అమిత్ మాట్లాడు తూ ధరణి పోర్టల్ సమయంలో రైతులు అనేక సమస్యలు ఎదుర్కొ న్నారని, తహసిల్దార్ ,ఆర్డీవో, కలెక్ట ర్ కార్యాలయాలు చుట్టూ తిరిగిన ప్పటికీ పనులు కాలేదని, భూ భా రతిలో అలాంటి బాధ లేదని తెలి పారు. ధరణిలో రికార్డులు లేకుంటే సివిల్ కోర్టుకు వెళ్లాల్సి వచ్చేదని, ఇప్పుడు తహసిల్దార్ వద్దనే రికా ర్డులు ఉంటాయని తెలిపారు. భూ భారతిలో 80 శాతం సమస్యలను తహసిల్దార్ స్థాయిలో పరిష్కారం అవుతాయని, 10 శాతం ఆర్ డి ఓ ,10 శాతం జిల్లా కలెక్టర్ స్థాయిలో పరిష్కరించబడతాయని తెలిపా రు. భూమి ఉన్న ప్రతి రైతుకు ఆధా ర్ కార్డు లాగా భూదార్ కార్డును ఇవ్వడం జరుగుతుందని, రైతులు అందరూ భూ భారతి చట్టాన్ని స ద్వినియోగం చేసుకోవాలని కోరా రు.
దేవరకొండ ఆర్డిఓ రమణారెడ్డి మాట్లాడుతూ గతంలో సాధాబైనా మా,పౌతి,మ్యుటేషన్ తదితర అ న్నింటికీ రైతులు సమస్యలు ఎదు ర్కొన్నారని, భూ భారతిలో అలాం టి ఇబ్బంది లేదని, కింది స్థాయిలో అన్యాయం జరిగితే పై స్థాయికి అ ప్పీల్ కు వెళ్లే అవకాశం ఉందని తెలిపారు.
అడిషనల్ ఎస్పీ మౌనిక మాట్లాడు తూ రైతుల భూములకు పోలీస్ తరఫున రక్షణ కల్పిస్తామన్నారు. ప్రతి గ్రామంలో పోలీసు అధికారిని నియమించడంజరిగిందని,ఎవరైనా భూములను ఆక్రమిస్తే కఠిన చర్యలు తీసుకుం టామని, అందు వలన రైతులెవరు ఆందోళన చెం దాల్సిన అవసరం లేదని తెలిపా రు. జూన్ 2 నుండి భూ భారతి పోర్టల్ అందుబాటులోకి రానుం దని, అందువల్ల రైతులు భూ భార తి చట్టాన్ని సద్వినియోగం చేసుకో వాలని కోరారు.మండల ప్రత్యేక అధికారి మల్లేశ్వర రావు, తహసి ల్దార్ శ్రీనివాసరావు, ఎంపీడీవో చంద్ర మౌళి, తదితరులు ఈ అవ గాహన సదస్సుకు హాజరయ్యారు.