–అక్కంపల్లి రిజర్వాయర్ లో బర్డ్ ఫ్లూతో చనిపోయిన కోళ్లు
–రిజర్వాయర్ ద్వారా జిల్లా, జంట నగరాలకు తాగునీరు
–విచారణకు ఆదేశించిన నల్లగొండ కలెక్టర్ ఇలా త్రిపాఠి
Collector Tripathi : ప్రజా దీవెన, నల్లగొండ: తెలుగు రాష్ట్రాలను భయాందోళనకు గురి చేస్తున్న బర్డ్ ఫ్లూ ఇప్పుడు ప్రత్యే కించి నల్లగొండ జిల్లాతో పాటు భా గ్యనగర వాసులను వణికిస్తోంది. జిల్లాలోని పెద్ద అడిశర్లపల్లి మండ లంలోని అక్కంపల్లి రిజర్వాయర్ ( నీటిలో)లో బర్డ్ ఫ్లూతో చనిపో యిన వంద లాది కోళ్లు కనిపించ డం కలకలం సృష్టించింది. బర్డ్ ఫ్లూ కారణంగా మృతి చెందిన కోళ్లను గుర్తు తెలియని వ్యక్తులు ఇటీవల తాగునీటి అవసరాలు తీరుస్తున్న అక్కంపల్లి రిజర్వాయర్‌లో పడే సినట్లు అనుమాలు వ్యక్తమవుతు న్నాయి. ఈ రోజు ఉదయం చేపల వేటకు వెళ్లిన వారు రిజర్వాయర్ నీటిలో కోళ్ల కళేబరాలను గుర్తించి విషయాన్ని అధికారులు దృష్టికి తీసుకెళ్లారు. ఏకేబీఆర్ రిజర్వాయ ర్ నుంచే నల్లగొండ జిల్లాలోని వం దలాది గ్రామాలతో పాటు హైదరా బాద్ జంట నగరాలకు నిత్యం తా గునీరు సరఫరా అవుతున్న విష యం విదితమే.
రిజర్వాయర్ లో కోళ్ల కళేబరాలు ఉన్నాయని సా మాజిక మాధ్యమాల్లో విస్తృత ప్రచారం కావడంతో ఆ నీటిని తాగి న వేలాది మంది ప్రజలు తమకే మైనా అవుతుందేమోనని ఆందో ళనకు గురవుతున్నారు. ఏ కె బి ఆర్ రిజర్వాయర్ లో మృతి చెంది న కోళ్లను వేసిన ఘటనను అధికా రుల ద్వారా తెలుసుకున్న జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి అత్యవసర పరిస్థితి గా పరిగణించి సమగ్ర వి చారణకు ఆదేశించడం తోపాటు ఈ ఘటనపై విచారణ జరిపి బా ధ్యులపై కఠిన చర్యలు తీసుకోవా లని అధికారులను ఆదేశించారు. దేవరకొండ ఆర్డిఓ రమణారెడ్డి ఘ టన స్థలాన్ని పరిశీలించి జాలర్లతో కోళ్ల కళేబరాలను బయటకు తీ యించారు. ఏ కే బి ఆర్ రిజర్వా యర్ సమీపంలోని వద్దిపట్ల గ్రామా నికి చెందిన ఓ పౌల్ట్రీ ఫార్మ్ యజ మాని ఇందుకు బాధ్యునిగా అను మానించి పోలీసులు అదుపులోకి తీసుకొని విచారణ చేస్తున్నట్లు విశ్వసనీయ సమాచారం.