Collector Tripathi : ప్రజా దీవెన, నల్లగొండ: నల్లగొండ జిల్లా మాడుగులపల్లి మండల కేంద్రంలో చేపట్టిన గ్రామపంచా యతీ భవన నిర్మాణాన్ని 2 నెలల్లో పూర్తిచేసి ప్రారంభోత్సవానికి సిద్ధం చేయాలని జిల్లా కలెక్టర్ ఇలా త్రిపా ఠి ఇంజనీరింగ్ అధికారులను ఆదే శించారు.శనివారం సాయంత్రం ఆమె మాడుగులపల్లి మండల కేంద్రంలో నిర్మాణంలో ఉన్న గ్రామ పంచాయతీ భవనాన్ని ,కేజీబీవీని తనిఖీ చేశారు. అంతేకాక ప్రతి పాదిత తహసిల్దార్, ఎంపీడీవో, కార్యాలయాలతో పాటు, పోలీస్ స్టేషన్ భవనాల నిర్మాణానికి ఎంపి క చేసిన స్థలాన్ని పరిశీలించారు.
ముందుగా జిల్లా కలెక్టర్ గ్రామపం చాయతీ భవన నిర్మాణ పనులను తనిఖీ చేసిన అనంతరం 2 నెలల్లో పూర్తి చేసి ప్రారంభోత్సవానికి సిద్ధం చేయాలని పంచాయతీరాజ్ ఎగ్జి క్యూటివ్ ఇంజనీర్ ను ఆదేశించా రు .అలాగే కస్తూర్బా గాంధీ బాలిక విద్యాలయాన్నీ సాధ్యమైనంత త్వరగా పూర్తి చేయాలి అన్నారు. అనంతరం జిల్లా కలెక్టర్ మాడుగు లపల్లి సమీపంలోని 257 సర్వే నంబర్లో తహసిల్దార్, ఎంపీడీవో కార్యాలయాలతో పాటు, పోలీస్ స్టేషన్ భవనాల నిర్మాణానికి ఎం పిక చేసిన 3 ఎకరాల స్థలాన్ని పరిశీ లించారు. భవన నిర్మాణాలకు గాను 2 రోజుల్లో మ్యాపులతో సహా వివరాలు సమర్పించాలని ఆర్ అండ్ బి ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ యాకూబ్ ను ఆదేశించారు.
జిల్లా కలెక్టర్ వెంట మిర్యాలగూడ సబ్ కలెక్టర్ నారాయణ అమిత్, మాడుగులపల్లి తహసిల్దార్ సురేష్ కుమార్ తదితరులు ఉన్నారు.