— నల్లగొండ జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి
Collector Tripathi : ప్రజా దీవెన, నకిరేకల్: నకిరేకల్ లోని తెలంగాణ సోషల్ వెల్ఫేర్ బాలికల రెసిడెన్షియల్ పాఠశాలలో అవసరమైన సౌక ర్యాలను కల్పి స్తామని జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి తెలిపారు.శుక్రవారం ఆమె నకిరేక ల్ లో ఉన్న తెలంగాణ సోష ల్ వెల్ఫేర్ బాలికల రెసిడెన్సీయల్ పాఠశా లను ఆకస్మిఖంగా తనిఖీ చేశారు. విద్యార్థులతో ముఖాము ఖి మాట్లాడి విద్య ,భోజనం తది తర వివ రాలను అడిగి తెలుసుకు న్నారు.
ఈ సందర్భంగా పాఠశాల ప్రిన్సిపాల్ శోభారాణి, ఉపాధ్యా యులు తమ పాఠశాలలో డ్రైనేజీ సమస్య ఉందని, అంతేకాక విద్యా ర్థినిలు బట్టలు ఉతుక్కునేందుకు వాష్ ఏరియా కావాలని ,అలాగే రెండు అదనపు తరగఠీ గదు లు,లైబ్రరీ మంజూరు చేయాలని విన్నవించగా, ఇందుకు జిల్లా కలెక్టర్ స్పందిస్తూ డ్రైనేజీ సమ స్యను, వాష్ ఏరియా సమ స్యలను తక్షణమే పరిష్క రిం చాలని నకిరేకల్ మున్సిపల్ కమిషనర్ ను ఆదేశించారు. లైబ్రరీ అదనపు తరగతి గదుల నిర్మాణాన్ని 3 నెలల్లో చేపడతామని తెలిపారు.
జిల్లా కలెక్టర్ వెంట ఆర్డీవో వై.అశో క్ రెడ్డి,గృహ నిర్మాణ పిడి రాజ్ కుమార్ ,తదితరులు ఉన్నారు.