— నల్లగొండ జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి
Collector Tripathi : ప్రజా దీవెన, నల్లగొండ: రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేయనున్న ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణంలో భాగంగా గత నెల 26న పథకాన్ని లాంఛనంగా ప్రారంభించిన గ్రామాలలో ఇళ్ల నిర్మాణాన్ని ప్రారంభించేందుకు చర్యలు తీసుకోవాలని జిల్లా కలె క్టర్ ఇలా త్రిపాఠి సూచించారు.
ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణంపై అవగాహన నిమిత్తం శుక్రవారం జిల్లా కలెక్టర్ కార్యాలయావర ణంలోని ఉదయాదిత్య భవన్లో సంబంధిత గ్రామాల పంచాయతీ కార్యద ర్శులు, మేస్త్రీలకు సన్నా హక సమావేశాన్ని నిర్వ హించా రు.ముఖ్యంగా గత నెల 26 న ఇందిరమ్మ ఇండ్ల పథకాన్ని ప్రారం భించిన గ్రామాలలో ఇండ్ల నిర్మా ణానికి తీసుకోవాల్సిన చర్య లపై ఆమె అవగాహన కల్పించారు. ఇంటి నిర్మాణానికి తీసుకోవాల్సిన విస్తీర్ణం, చెల్లింపులు, వాడవలసిన సాంకేతిక అంశాలపై తెలియజే శారు. కొత్తగా నిర్మించిన ఇండ్లకు మాత్రమే ప్రభుత్వ నిబంధనల ప్రకా రం చెల్లింపులు చేయడం జరుగు తుందని, పాత ఇండ్లకు ఎలాంటి నిధులు ఇవ్వడం జరగదని, అంతే కాక ఉన్న ఇంటికి కొనసాగింపుగా ఇల్లు నిర్మించినా బిల్లులు ఇవ్వడం జరగదని స్పష్టం చేశారు. వివిధ దశలలో చెల్లింపుల విధానాన్ని, అయా ఇంటి నిర్మాణం లో వాడాల్సిన సామాగ్రి,ఇతర సాం కేతిక సమస్యలు తదితర అంశా లపై వివరించారు. గృహ నిర్మాణ శాఖ ప్రాజెక్టు డైరెక్టర్ రాజకుమార్, ఆర్డిఓ, ఇన్చార్జి డిఆర్ఓ వై. అశోక్ రెడ్డి తదితరులు ఈ సమావేశానికి హాజరయ్యారు.