నల్లగొండ జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి..
Collector Tripathi : ప్రజా దీవెన, శాలిగౌరారం ఫిబ్రవరి 19: ఇసుక తరలింపు ల నిఘా పూర్తి స్థాయిలో పెంచాలని, ఎవరైనా ఇసుకను నిబంధనలకు విరుద్దంగా తరలిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని నల్గొండ జిల్లా కలక్టర్ ఇలా త్రిపాఠీ అన్నారు.బుధవారం ఆమె జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్, అదనపు కలెక్టర్ జె. శ్రీనివాస్, మైనింగ్ ,తదితర శాఖల అధికారులతో కలిసి శాలిగౌరారం మండలం, వంగమర్తి, ఇటుకల పహాడ్ ఇసుక రీచ్ ల వద్ద ఇసుక తవ్వే ప్రాంతాలను తనిఖీ చేశారు. వంగమర్తి ,ఇటుకలపహాడ్ రీచ్ ల వద్ద ఇసుక తవ్వే ప్రాంతాలలో ఇదివరకే సీసీ కెమెరాలు ఏర్పాటు చేయడమే కాకుండా, వే బ్రిడ్జి, ఇసుకను లోడ్ చేసే చోట సీసీ కెమెరాలు ఏర్పాటు చేశారాని,రాత్రి సమయాల్లో కూడా స్పష్టంగా కనిపించే సామర్థ్యం కలిగిన సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలని కలెక్టర్ ఆదేశించారు. ఇప్పటివరకు వంగమర్తి ఇసుక రీచ్ నుండి తీసిన ఇసుక పరిమాణం వివరాలను కలెక్టర్ అడిగి తెలుసుకున్నారు . ఈ సంవత్సరం వంగమర్తి ఇసుక రీచ్ నుండి లక్ష 16 వేల మెట్రిక్ టన్నుల ఇసుకను తీసినట్లు అధికారులు జిల్లా కలెక్టర్ కు వివరించారు. ఇసుక అక్రమ రవాణా కాకుండా గట్టి చర్యలు తీసుకోవాలని, ఇసుక సరఫరాను ఎప్పటికప్పుడు జాగ్రత్తగా పరిశీలిస్తూ ఉండాలని చెప్పారు.
ఎట్టి పరిస్థితులలో పరిమితికి మించి లోడును తీసుకువెళ్లకూడదని, అన్ని అంశాలకు రికార్డులు, రిజిస్టర్లు నిర్వహించాలని జిల్లా కలెక్టర్ అన్నారు. ఇటీవల ఎస్పీ ఆదేశాల మేరకు వంగమర్తి ఇసుక రీచ్ వద్ద 24 గంటలు తనిఖీ చేసే విధంగా పోలీస్ అవుట్ పోస్టును ఏర్పాటు చేయడం జరిగిందన్నారు.ఈ విషయాలన్నీ ప్రభుత్వ నిబంధనల ప్రకారం చేస్తున్నది, లేనిధి పరిశీలించే నిమిత్తం జిల్లా కలెక్టర్, ఎస్పీ ,మైనింగ్ అధికారులు సందర్శించారు.
కాగా జిల్లాలో వంగమర్తి తో పాటు, ఇంకా 24 ఇసుక రీచ్ లు ఉన్న విషయం తెలిసిందే .వీటి ద్వారా ప్రభుత్వ పనులకు ముఖ్యంగా ఇరిగేషన్, ఆర్ అండ్ బి, పంచాయతీరాజ్, తదితర శాఖలకు ఎంత ఇసుక అవసరం ఉందో దానికి సంబంధించిన విధివిధానాల రూపకల్పన విషయమై గురువారం సమావేశం ఏర్పాటు చేయాలని జిల్లా కలెక్టర్ ఆదేశాలు జారీ చేశారు.
జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్ మాట్లాడుతూ వంగమర్తి ఇసుక రీచ్ నుండి ఇసుక అక్రమంగా రవాణా కాకుండా తీసుకుంటున్న చర్యలలో భాగంగా పోలీస్ అవుట్ పోస్టు ఏర్పాటు, తదితర విషయాలను జిల్లా కలెక్టర్ కు వివరించారు.
ఈ కార్యక్రమం లో భూగర్భ జల వనరుల శాఖ సహాయ సంచాలకులు జాకబ్,ఆర్ డి ఓ. యానాల అశోక్ రెడ్డి,నల్గొండ డి ఎస్ పి శివ రాంరెడ్డి,శాలిగౌరారం సీఐ కొండల్ రెడ్డి,తహసీల్దార్ పి. యాదగిరి, ఎంపీడీఓ గార్లపాటి జ్యోతి లక్ష్మి తదితరులు ఉన్నారు .