–కలెక్టర్ ఇలా త్రిపాఠి
–లబ్ధిదారులకు ప్రొసీడింగ్ కాపీల అందజేత
Collector Tripathi : ప్రజాదీవెన నల్గొండ : రాష్ట్ర ప్రభుత్వం ప్లాట్ల రెగ్యులరైజేషన్ కోసం ఈ నెల 31 లోగా ఎల్ ఆర్ ఎస్ చెల్లించిన వారికి ప్రకటించిన 25 శాతం రిబెట్ పథకానికి ప్రజల నుండి మంచి స్పందన వస్తున్నది.
ఈ మేరకు సోమవారం నల్గొండ మున్సిపల్ పరిధిలో 4గురు లబ్ధిదారులు ఎల్ఆర్ఎస్ చెల్లించి 25 శాతం రిబేటు పొందారు. ఇందుకు సంబంధించిన ప్రొసీడింగ్ కాపీలను జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాటి తన ఛాంబర్ లో లబ్ధిదారులకు అందజేశారు.
ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ఎల్ఆర్ఎస్ పై ప్రకటించిన 25 శాతం రిబేటు స్కీమును సద్వినియోగం చేసుకోవాలని , ఇందుకు కేవలం 13 రోజులు మాత్రమే మిగిలి ఉందని తెలిపారు. ఎల్ఆర్ఎస్ చెల్లింపు కు సంబంధించి ఏవైనా సందేహాలు ఉంటే జిల్లాలోని అన్ని మున్సిపల్ కార్యాలయాలలో హెల్ప్ డెస్క్ లు ఏర్పాటు చేయడం జరిగిందని, వీటి ద్వారా సందేహాలను తీర్చుకోవచ్చని తెలిపారు. స్థానిక సంస్థల ఆదనపు కలెక్టర్ జె. శ్రీనివాస్, మున్సిపల్ కమిషనర్ సయ్యద్ ముసాబ్ అహ్మద్, తదితరులు ఉన్నారు.