కలెక్టర
–చిట్యాల పిహెచ్సి లో కలెక్టర్ ఆకస్మిక తనిఖీ
Collector Tripathi : ప్రజాదీవెన నల్గొండ : ప్రాథమిక వైద్య ఆరోగ్య కేంద్రంలో ప్రసవాల సంఖ్యను పెంచాలని జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి అన్నారు. గురువారం ఆమె నల్గొండ జిల్లా చిట్యాల ప్రాథమిక వైద్య ఆరోగ్య కేంద్రాన్ని ఆకస్మికంగా తనిఖీ చేశారు. హాస్పిటల్ సిబ్బంది రిజిస్టర్, ఓపి, ఇన్ పేషెంట్లు, మందులు, ఇతర రిజిస్టర్లు అన్నింటిని తనిఖీ చేశారు. ఆసుపత్రి ద్వారా అందిస్తున్న వైద్య సేవలను ప్రాథమిక వైద్య ఆరోగ్య కేంద్రం డాక్టర్ ద్వారా అడిగి తెలుసుకున్నారు.
డెలివరీలు చేస్తున్నారా? ప్రతిరోజు ఎంత మంది ఆసుపత్రికి వస్తున్నారు? ఎన్ని గర్భిణీ స్త్రీ కేసులు ఉన్నాయని? ప్రశ్నించారు. ఏమైనా సమస్యలున్నాయా ?అని ప్రశ్నించగా విద్యుత్ సమస్య ఉందని జిల్లా కలెక్టర్ కు తెలియజేయగా, తక్షణమే ఆ సమస్యను పరిష్కరిస్తామని కలెక్టర్ తెలిపారు.
ఆస్పత్రి ద్వారా నిర్వహించే ప్రసవాల సంఖ్యను పెంచాలని, ఆబార్ష న్లను నియంత్రించాలని, అలాంటి వాటిని ప్రోత్సహించొద్దన్నారు. కుటుంబ నియంత్రణ శస్త్ర చికిత్సలు చేయించుకునే విధంగా అర్హు లైన జంటలను ప్రోత్సహించాలని వారికి అవగాహన కల్పించాలని ఆమె తెలిపారు.జిల్లా కలెక్టర్ వెంట డిప్యూటీ తహసిల్దార్ విజయ, తదితరులు ఉన్నారు.