Welcome To Praja Deveena News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alert at prajadeveena.com

Collector Tripathi : ఎమ్మెల్సీ ఎన్నికల ఏర్పాట్లు పూర్తి చేశాం

— సిఈఓతో వీడియో కాన్ఫరెన్స్ లో

–నల్లగొండ జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి

Collector Tripathi : ప్రజా దీవెన నల్లగొండ: వరంగల్- ఖమ్మం -నల్గొండ ఉపా ధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల నిర్వ హణకు అన్ని ఏర్పాట్లు చేసినట్లు జిల్లా కలెక్టర్, వరంగల్ -ఖమ్మం- నల్గొండ ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల రిటర్నింగ్ అధికారి ఇలా త్రిపాఠి రాష్ట్ర ప్రధానఎన్నికల అధి కారి సుదర్శన్ రెడ్డికి తెలియ జేశా రు.శుక్రవారం రాష్ట్ర ప్రధాన ఎన్ని కల అధికారి ఉపాధ్యాయ ఎమ్మె ల్సీ ఎన్నికలు, గ్రాడ్యుయేట్ ఎమ్మె ల్సీ ఎన్నికలు జరగనున్న నియోజ కవర్గాల రిటర్నింగ్ అధికారులు, జిల్లాల జిల్లా ఎన్నికల అధికారులు, ఎస్పీలతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వ హించారు. వరంగల్- ఖమ్మం- నల్గొండ ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల ఏర్పాట్లపై జిల్లా కలెక్టర్ ను కోరగా జిల్లా కలెక్టర్ స్పందిస్తూ ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించి నియోజకవర్గ వ్యాప్తంగా 200 పోలింగ్ కేంద్రాలు ఉన్నాయని, నల్గొండ జిల్లాకు సం బంధించి 37 ఉన్నాయని, ఇందు కుగాను 50 మంది ప్రిసైడింగ్ అధి కారులను ,50 మంది పోలింగ్ అధి కారులను నియమించడమే కాకుం డా, వారికి శిక్షణ కార్యక్రమాలను పూర్తి చేశామని తెలిపారు.వ్ 22 వేల 439 ఓటర్ ఇన్ఫర్మేషన్ స్లిప్పు లకు గాను, 3358 వరకు పంపిణీ చేయడం జరిగిందని, ఈనెల 25 లోపు తక్కినవి పంపిణీ చేస్తామ ని, నల్గొండ జిల్లాకు సంబంధించి 4182 ఓటర్ స్లిప్పులకు గాను, ఇ ప్పటివరకు 501 పంపిణీ చేసినట్లు ఆమె వెల్లడించారు.

 

రాష్ట్ర ఎన్నికల సంఘం ఆదేశాల ప్రకారం ఎమ్మెల్సీ ఎన్నికలకు జంబో బ్యాలెట్ బాక్సు లు వినియోగి స్తున్నామని, నియో జకవర్గ పరిధిలో అన్ని జిల్లాలలో సరిపడే విధంగా జంబో బాక్సులు ఉన్నాయని , సిద్దిపేట జిల్లాకు మా త్రం జనగామ నుండి తీసుకుంటు న్నారని తెలిపారు. 28 వేల బ్యాలె ట్ పేపర్లను ఈ ఎన్నికలలో విని యోగించడం జరుగుతున్నదని, వీటన్నింటినీ ఇదివరకే పరిశీలించ డం జరిగిందని, శనివారం అన్ని జిల్లాలకు వీటిని పంపిస్తున్నట్టు తెలియజేశారు. ఎమ్మెల్సీ ఎన్నికల ప్రవర్తన నియమావళి, ఇతర నియమ, నిబంధనలను ఎప్పటికప్పుడు పోటీలో ఉన్న అభ్యర్థులకు, రాజకీయ పార్టీలకు ,వారి ఏజెంట్లకు తెలియజేస్తున్నామని ఆమె వివరించారు. పోలింగ్ కేంద్రాలలో వెబ్ కాస్టింగ్ ఏర్పాటుకు గాను బిఎస్ఎన్ఎల్ కు వర్క్ ఆర్డర్ ఇవ్వడం జరిగిందని తెలిపారు. నల్గొండ పట్టణం సమీపంలోని ఆర్జాలబావి గోదాము వద్ద ఓట్ల లెక్కింపు కేంద్రాన్ని ఏర్పాటు చేశామని, ఎమ్మెల్సీ ఎన్నికల సాధారణ పరిశీలకులు ప్రత్యక్షంగా అర్జాలబావి గోదాం సందర్శించి ఆమోదం తెలిపారని చెప్పారు. అలాగే 50 మంది మైక్రో అబ్జర్వర్ల ను నియమించామని, వారికి శిక్షణ కార్యక్రమాన్నీ కూడా పూర్తి చేయ డం జరిగిందని వెల్లడించారు.జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవర్ మాట్లాడుతూ వరంగ ల్- ఖమ్మం- నల్గొండ ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల సందర్భంగా 37 పోలింగ్ స్టేషన్లు ఉండగా, 5 క్రిటికల్ పోలింగ్ స్టేషన్లు గుర్తించడం జరిగిందని, 13 రూట్లను ఏర్పాటు చేశామని, అలా గే ఇందుకు సంబంధించి 15 స్ట్రైకిం గ్ ఫోర్సు , 3 స్పెషల్ స్ట్రైకింగ్ ఫో ర్స్, 29 ఫ్లయింగ్ స్పాడ్స్ ,41 ఎం సి సి బృందాలను నియమించా మని, మొత్తం ఎన్నిక లలో518 మంది పోలీసుల సేవలను తీసు కుంటున్నట్లు తెలిపారు. ఎమ్మెల్సీ ఎన్నికల సందర్భంగా ఎలాంటి ఇబ్బందులు లేకుండా బందోబస్తు ఏర్పాటు చేస్తామని ఆ యన విరమించారు. అంతకుముం దు రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి సుదర్శన్ రెడ్డి వివిధ అంశాలపై ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ,గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల సంబంధించిన ఏర్పాట్లపై పలు సూచనలు చేశారు.అదనపు కలెక్టర్ , వరంగల్- ఖమ్మం- నల్గొండ ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల అదనపు రిటర్నింగ్ అధికారి జె. శ్రీనివాస్, తదితరులు ఈ వీడియో కాన్ఫరెన్స్ కు హాజరయ్యారు.