Welcome To Praja Deveena News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alert at prajadeveena.com

collectorilaTripathi : క్రీడలు మానసికొల్లాసానికి దోహదం

క్రీడలు మానసికొల్లాసానికి దోహదం

— పోలీస్ యాన్యువల్ స్పోర్ట్స్ అండ్ గేమ్స్ మీట్ లో కలెక్టర్ ఇలా త్రిపాఠి

collectorilaTripathi: ప్రజా దీవెన నల్లగొండ: క్రీడలు మానసి కోలాసంతో పాటు దేహదారుఢ్యoకు ఎంతో దోహదపడతాయని నల్ల గొండ జిల్లా కలెక్టర్ జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి పేర్కొన్నా రు. జిల్లా పో లీస్ హెడ్ క్వా ర్టర్స్ లో గురువారం జరిగిన ప్రారంభోత్సవ కార్యక్ర మంలో ఆమె ముఖ్యతిదిగా పాల్గొని స్పోర్ట్స్ అండ్ గే మ్స్ మీట్ ను ప్రారంభించారు.ఈ కార్యక్రమానికి జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి ఐఏఎస్ ముఖ్యతిదిగా పాల్గొని జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్ ఐపీఎస్ తో కలిసి ప్రారంభించి, జిల్లా పోలీస్ శాఖలోని విభా గాల వారీగా చేసిన అద్భుతమైన పెరేడ్ ను తిలకించారు.అనంతరం స్పోర్ట్స్ అండ్ గేమ్స్ మీట్ ఫ్లాగ్ ను ఆవిష్కరించారు.

ఈ సందర్భంగా మాట్లాడుతూ జిల్లా కలెక్టర్ గా బాధ్యతలు స్వీకరిం చిన తర్వాత పాఠశాలల సందర్శనకు వెళ్ళినప్పుడు బందో బస్తుగా వచ్చిన పోలీస్ అధికారులు సిబ్బందిని చూసి విద్యార్థులు స్ఫూర్తి పొందడం ఎంతో ఆనందాన్ని ఇచ్చిందన్నారు. పోలీస్ అంటేనే ఒత్తిడి తో కూడు కున్న ఉద్యోగం అని అన్నారు. పోలీస్ శాఖలో పనిచేస్తున్న అధి కారులు సిబ్బంది శారీరక స్ఫూర్తితో పాటు మానసికంగా అలర్ట్ కావా లని అందుకోసం క్రీడలు ఎంతో దోహదపడతాయన్నారు. క్రీడల ద్వారా సమతుల్యమైన శారీరక మానసిక అభివృద్ధి పొందుతుందని అన్నారు. పోలీస్ శాఖ కు టీమ్ స్పిరిట్ చాలా ముఖ్యమన్నారు.

ని త్యం విధినిర్వహణలో ఒత్తిడిలో ఉండే పోలీస్ శాఖలో పనిచేస్తు న్న వారికి ఈ స్పోర్ట్స్ మీట్ ద్వారా మంచి మేలు జరు గుతుందని ఆ కాంక్షించారు. తమకు అవసరమైన విషయాలను కూడా పోలీస్ శా ఖ లోని ముఖ్యమైన విభాగాల నుంచి సమాచారం తెప్పించుకుని దా నికి అనుగుణం గా ప్రణాళికతో పనిచేస్తామన్నారు. క్రీడాకారులు ఈ స్పోర్ట్స్ మీట్లో మంచి ప్రతిభ కనబరిచి ఉన్నత స్థానాలకు ఎదగా లని ఆకాంక్షించారు.

జిల్లా ఎస్పి మాట్లాడుతూ జిల్లా పోలీస్ శాఖలో పనిచేసే అధికారు లకు మరియు సిబ్బందికి క్రీడలు ఎంతగానో ఉపయోగ పడతాయి ఇవి నిత్యజీవితంలో భాగంగా చేసుకొంటే ఆరోగ్యంగా ఉంటారని అన్నారు. క్రీడల ద్వారా మానసిక ఉల్లాసం,శారీరక దృఢత్వం కలిగి ఉంటుందని ఇవి ముఖ్యంగా పోలీసు శాఖలో వివిధ డ్యూటీలో వి ధులు నిర్వర్తిస్తున్న సమయంలో ఎంతగానో దోహదపడతాయి అ న్నారు. ఆటలలో గెలుపోటములు సహజమని క్రీడాకారులందరూ స్పోర్స్ స్పిరిట్ తో ఆడాలని అన్నారు.

జీవితంలో ఎన్నో ఆటుపోట్లు వస్తాయని వాటిని తట్టుకునేందుకు క్రీడలు ఎంతో ముఖ్యమన్నారు ఓటమిని అంగీకరించి భవిష్యత్తులో మరింత ముందుకు వెళ్లి వాటిని అధిగమించేందుకు కృషి చేయాలి అన్నారు. ఈ స్పోర్ట్స్ మీట్లో క్రీడాకారులు తమ నైపుణ్యాన్ని ప్రదర్శిం చాలని జీవితాంతం ఇదే ఫిట్నెస్ను కొనసాగించాలని సూచించారు. పోలీస్ అధికారులు సిబ్బంది ఆరోగ్యం కోసమే గేమ్స్ తో పాటు పరే డ్,జిమ్ లాంటి కార్యక్రమాలను నిర్వహిస్తున్నమన్నారు. ప్రతి ఒక్కరికీ స్పోర్ట్స్ లైఫ్ స్టైల్ గా ఉండాలని ఏంచుకోవాలని అన్నారు.

ఈ పోటీలలో నల్లగొండ,మిర్యాలగూడ,దేవరకొండ డివిజన్ల తోపాటు నల్లగొండ ఏ.ఆర్ విభాగం జట్లు కూడా ప్రాతినిధ్యం వహించాయి. సుమారు 300 మంది అధికారులు సిబ్బంది ఈ పోటీలలో పాల్గొను న్నారు. క్రీడలు మూడు రోజులపాటు జరగనున్న ఈ స్పోర్ట్స్ మీట్లో కబడ్డీ, వాలీబాల్, క్రికెట్, ఫుట్ బాల్, అథ్లెటిక్స్, షాట్ పుట్ తదితర క్రీడాంశాలలో పోటీలను నిర్వహిస్తున్నాన్నారని అన్నారు. ఈ కార్య క్రమంలో ఏఎస్పి మౌనిక ఐపీఎస్,ఎస్బి డీఎస్పీ రమేష్, డిటిసి డీఎస్పీ విఠల్ రెడ్డి, నల్లగొండ డీఎస్పీ శివరాం రెడ్డి,మిర్యాలగూడ డీఎస్పీ రాజశేఖర్ రాజు,ఏ.ఆర్ డీఎస్పీ శ్రీనివాసులు, సిఐలు,ఆర్.లు,యస్. ఐలు, ఆర్.యస్.ఐలు,వ్యాయామ ఉపాధ్యాయులు మరియు పో లీసు క్రీడా కారులు పాల్గొన్నారు.