Collectorilatripathi: ప్రజా దీవెన, గుర్రంపోడు: నల్లగొండ జిల్లాలో రైతులు పండించిన ప్రతి ధాన్యం గింజను కొంటామని జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి తెలిపారు. రబీ ధాన్యం కొనుగోలులో భాగంగా ఇ ప్పటివరకు నల్గొండ జిల్లాలో 4 లక్ష ల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని కొను గోలు చేయడం జరిగిందని, నిజా మాబాద్ తర్వాత అత్యధికంగా ధా న్యం కొనుగోలు చేసిన జిల్లాలలో న ల్గొండ రెండవదని తెలిపారు. వర్షం వచ్చినప్పటికి రైతులు ఎలాంటి ఇ బ్బంది పడాల్సిన అవసరం లేదని, వారం రోజుల్లో జిల్లాలో ధాన్యం కొనుగోలును పూర్తి చేసేందుకు సిద్ధంగా ఉన్నామని చెప్పారు.
మంగళవారం జిల్లా కలెక్టర్ నల్గొండ జిల్లా గుర్రంపోడు మండలం కొప్పో లు, గుర్రంపోడు మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన దాన్యం కొనుగోలు కేంద్రాలను ఆకస్మికంగా తనిఖీ చేశా రు. ఇక్కడ లారీల సమస్య ఉత్ప న్నమైందని తెలుసుకొని తక్షణమే ఈ రెండు కేంద్రా లకు వెళ్లి సమస్య పై అక్కడి రైతులు, స్థానికులతో మాట్లాడారు.
లారీల సమస్య లే కుండా లారీలను ఎప్పటికప్పుడు పంపించే ఏర్పాటు చేస్తామని అ న్నారు. ఒకే మిల్లుకు నాలుగైదు లారీలు పంపించకుండా ఆ పరిధి లో ఉన్న అన్ని మిల్లులకు ఒక్కో లా రీ పంపించాలని, అప్పుడే ధాన్యా న్ని వెంట వెంటనే దించుకోవడం కొ నుగోలు కేంద్రాలనుండి పంపించ డం సులభం అవుతుందని, లేదం టే ఒకే మిల్లుకు పంపించినట్లయితే దిగుమతి చేసుకోవడంలో ఇబ్బం దులు తలెత్తుతాయని అన్నారు.
ఒకవేళ కేటాయించిన లారీలు సరి పోకపోతే అదనంగా స్థానికంగా లా రీలను ఏర్పాటు చేయాలని తహ సిల్దార్ శ్రీనివాసులు ఆమె ఆదేశిం చారు. కొనుగోలు కేంద్రాలకు వ చ్చి న దాన్యం నాణ్యత ప్రమాణాలకు అనుకూలంగా ఉంటే వెంటనే కొను గోలు చేసి మిల్లులకు పంపిం చాల ని చెప్పారు. ఎట్టి పరిస్థితులలో ట్రా న్స్పోర్ట్ సమస్య, మిల్లర్ల సమస్య రాకూడదని ఆదేశించారు.
దాన్యం కొనుగోలులో ఇబ్బంది కాకుండా ఎప్పటికప్పుడు ప్రతిరోజు టెలికా న్ఫరెన్సు ద్వారా తాను సమీ క్షించ డమే కాకుండా, మిల్లర్లతో సమా వేశాలు నిర్వహించి ధాన్యం కొను గోలును వేగవంతం చేస్తు న్నా మని, ఏ మిల్లుకు ఎంత దాన్యం అవసరమో పరిశీలించి పం పించడం జరుగుతున్నదని స్పష్టం చేశారు. ఇతర ప్రాంతాల నుండి దళారీలు ధాన్యా న్ని తీసుకు వచ్చినట్లయితే వారిపై కేసులు నమో దు చేస్తున్నామన్నారు.
అలాగే ఎవరైనా మిల్లర్లు కావాలని ఇబ్బందు లు పెట్టినట్లయితే వారిపై చర్య తీసుకోవడానికి వెనకాడబోమని హెచ్చరి స్తున్నామన్నా రు. తనతో పాటు, పౌర సరఫరాల అధికారు లు, ఇన్చార్జి రెవెన్యూ ఆదనపు కలెక్టర్ ప్రతిరోజు ఎప్పటికప్పుడు ధా న్యం కొనుగోలు కేంద్రా లను ఆ కస్మిక తనిఖీలు నిర్వహిస్తున్నట్లు కలెక్టర్ తెలిపారు.
మిర్యాలగూడ సబ్ కలెక్టర్, రెవె న్యూ అదనపు ఇన్చార్జి కలెక్టర్ నా రాయణ అమిత్, జిల్లా పౌరసరఫ రాల మేనేజర్ హరీష్, జిల్లా సహ కార అధికారి పత్యా నాయక్, గు ర్రంపొడ్ తహసిల్దార్ శ్రీనివాస్ త దితరులు ఉన్నారు. కాగా కొప్పో లు, గుర్రంపోడు ధాన్యం కొనుగో లు కేంద్రాలు ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం ద్వారా నిర్వ హిస్తుండగా, ఈ రెండు కేంద్రాలలో రి కార్డుల నిర్వహణ ,తేమ అన్ని సక్రమంగా ఉండడం పట్ల జిల్లా కలెక్టర్ సంతృప్తి వ్యక్తం చేశారు.