Welcome To Praja Deveena News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alert at prajadeveena.com

Collectorilatripathi : వృత్తి నైపుణ్య శిక్షణను సద్వినియోగం చేసుకోవాలి

వృత్తి నైపుణ్య శిక్షణ కార్యక్రమాలను సద్వినియోగం చేసుకోవాలి

—  నల్లగొండ జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి

Collectorilatripathi: ప్రజాదీవెన నల్లగొండ : వృత్తి నైపుణ్యం పెంపుదలకై ఇస్తున్న శిక్షణ కార్యక్రమాలను ఉపాధ్యాయులు సద్వి నియోగం చేసుకోవాలని జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి కోరారు.ఈనెల 13 నుండి జిల్లాలోని అన్ని పాఠశాలల ఉపాధ్యాయులకు ఉద్దేశిం చి రాష్ట్ర ప్రభుత్వం ఇస్తున్న శిక్షణ కార్యక్రమాలలో భాగంగా శని వారం ఆమె నల్గొండ జిల్లా కేంద్రంలోని సెయింట్ ఆల్ఫోన్సెస్ పాఠ శాలలో ఇస్తున్న శిక్షణ శిబిరాన్ని సందర్శించారు.

ఈ పాఠశాలలో ప్రాథమిక పాఠశాల ఉపాధ్యాయులకు ఉద్దేశించి రిసోర్స్ పర్సన్ లకు, అలాగే జిల్లాలోని అన్ని ఉన్నత పాఠశాలల ఉపాధ్యాయులకు శిక్షణ కార్యక్రమాన్ని ఇస్తున్నారు. ఈనెల 13 నుండి 17 వరకు మొదటి విడత, 20 నుండి 24 వరకు రెండవ విడత 27 నుండి 30 వరకు మూడవ విడత, మొత్తం మూడు విడతలలో శిక్షణ కార్యక్రమాలను ఇవ్వనుండగా, జిల్లా వ్యాప్తంగా ఈ నెలాఖరులోపు శిక్షణ కార్యక్రమాలు పూర్తి చేసేందుకు ప్రణాళిక రూపొందించడం జరిగింది.

ప్రాథమిక పాఠశాల ఉపాధ్యాయులకు శిక్షణ ఇచ్చేందుకు ఇక్కడ శిక్షణ పొందిన రిసోర్స్ పర్సన్లు ఆయా పాఠశాలల పరిధిలో ఎంపిక చేసిన ప్రాంతంలో శిక్షణ ఇవ్వనున్నారు. ఉన్నత పాఠశాలల ఉపా ధ్యాయులకు ఇంగ్లీషు, సోషల్ స్టడీస్, బయోసైన్స్, ఫిజికల్ సైన్స్, తెలుగు సబ్జెక్టులపై సెయింట్ ఆల్ఫాన్సెస్ లో శిక్షణ కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు.

ఉపాధ్యాయుల విద్యా బోధన పటిష్టం చేయటం, ముఖ్యంగా ఆ యా సబ్జెక్టులకు సంబంధించి వృత్తిపరమైన నైపుణ్యాలను పెంపొం దించేందుకు శిక్షణ ఇవ్వడంతో పాటు, ప్రాథమిక స్థాయిలో ఎఫ్ ఎల్ ఎన్ శిక్షణ ఇవ్వడం జరుగుతుంది. అలాగే ఉన్నత పాఠశాలల ఉ పాధ్యాయులకు లర్నింగ్ ఇంప్రూవ్మెంట్ ప్రోగ్రామ్ కింద బోధనా ప్రక్రి యలను పెంపొందించేందుకు శిక్షణ ఇవ్వడం జరుగుతుంది. టీచిం గ్ లెర్నింగ్ మెథడ్ తోపాటు, 3 డి పద్ధతిలో పవర్ పాయింట్ ప్రజెం టేషన్ తయారీ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వినియోగం వంటి వా టి పట్ల వీరికి శిక్షణ ఇస్తున్నారు.

ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ అన్ని స్థాయిలలో ఇచ్చే శిక్షణ కార్యక్రమాలను ఉపాధ్యాయులు సద్వినియోగం చేసుకొని ఇంకా మెరుగైన పద్ధతిలో విద్యార్థులకు బోధించేందుకు చర్యలు తీసుకోవాలని కోరారు. జిల్లా విద్యాశాఖ అధికారి బిక్షపతి, కోర్స్ డైరెక్టర్లు నల్గొండ ఎంఈఓ అరుంధతి, నకిరేకల్ ఎంఈఓ నాగయ్య, చిట్యాల ఎంఈఓ సైదయ్య, తదితరులు ఉన్నారు.