Commissioner C. V. Anand : ప్రజాదీవెన, హైదరాబాద్ : అవినాష్ కాలేజ్ ల పై హైదరాబాద్ పోలీస్ కమిషనర్ సీవీ ఆనంద్ కు తెలంగాణ బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షులు మేకపోతుల నరేందర్ గౌడ్ పిర్యాదు చేశారు.నిబంధనలకు విరుద్ధంగా కాలేజ్ నడుపుతూ విద్యార్థుల తల్లిదండ్రులపై ప్రయివేటు సైన్యంను (బౌన్సర్స్)ను ఏర్పాటు చేసుకొని దౌర్జనానికి దిగుతున్నారు. ఆర్ధిక ఇబ్బందుల వలన ఫీజు కట్టని విద్యార్థులను ఇంటర్నల్ ఎక్సమ్స్ రాయనివ్వకుండా, ఫీజులను కట్టడానికి ఏమాత్రం సమయం ఇవ్వకుండా ఇబ్బందులకు గురి చేస్తున్నారు, అంటే కాకుండా తల్లిదండ్రులను మీ పిల్లల భవిష్యత్ మా చేతులో ఉంది జాగ్రత్త అని బెదిరింపులకు దిగుతున్నారు.ఈ సమస్యను పరిష్కరించాలని పోలీస్ కమిషనర్ హైదరాబాద్ కు పిర్యాదు అందజేయడం జరిగింది.
ఈ కార్యక్రమంలో మేకపోతుల నరేందర్ గౌడ్, రాష్ట్ర అధ్యక్షులు తెలంగాణ రాష్ట్ర బీసీ సంక్షేమ సంఘం,గణపతి బిక్కు మహరాజ్, ఆజాద్ సోషల్ జస్టిస్ పార్టీ వ్యవస్థపక అధ్యక్షులు, ఎర్ర శ్రీవారి గౌడ్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు తెలంగాణ రాష్ట్ర బీసీ సంక్షేమ సంఘం తదితరులు పాల్గొన్నారు.