–అత్యంత వైభవంగా ముస్తాబైన దేవాలయం
–ముమ్మరంగా ఏర్పాటు చేస్తున్న దేవాలయ కమిటీ చైర్మన్ పెద్దిరెడ్డి అనంతరెడ్డి
Committee Chairman Peddireddy Ananthar Reddy : ప్రజా దీవెన నాంపల్లి ఫిబ్రవరి 26 మునుగోడు నియోజకవర్గ ంలోని నాంపల్లి మండల మండల కేంద్రంలోని శ్రీ ఉమా నాగలింగేశ్వర స్వామి కళ్యాణోత్సవం నేడు రాత్రి 8 గంటలకు అత్యంత వైభవంగా జరుగుతున్నట్లు అందుకు ఏర్పాట్లు చేశామని దేవాలయ కమిటీ చైర్మన్ పెద్దిరెడ్డి అనంతరెడ్డి ప్రజా దీవెనతో తెలుపా రు ఉదయం సుప్రభాత సేవ అఖండ దీపారాధన ఉత్సవ విగ్రహాలకు అభిషేకం నిర్వహించనున్నారు ఈనెల 27 ఉదయం స్వామివారి రథోత్సవం మధ్యాహ్నం అన్నదాత మహేశ్వరం సంపూర్ణ చారి దంపతులు అన్నదాన కార్యక్రమం నిర్వహించబడుతుందని దేవాలయం కమిటీ వివరించారు .
ఈ దేవాలయంలో గత 50 సంవత్సరాల నుండి యువజన సంఘాల కమిటీలనుండి కార్యక్రమాలు నిర్వహి స్తున్నారు శివరాత్రి వేడుకలలో పాల్గొన్న వారికి అష్టైశ్వర్యం సంతానం కలుగుతుందని భక్తులం నమ్మకం దేవాలయం బ్రహ్మోత్సవాలను నాంపల్లి మాజీ ఎంపీపీ పూల వెంకటయ్య మాల్ మార్కెట్ కమిటీ డైరెక్టర్ పూల యాదగిరి నాంపల్లి పట్టణ కాంగ్రెస్ అధ్యక్షుడు పానుగంటి వెంకటయ్య గౌడ్ భక్తులకు సౌకర్యాలను ఏర్పాటు చేస్తున్నారు