— నల్లగొండ జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి
Nellikallu Lift Irrigation Scheme : ప్రజాదీవెన, తిరుమలగిరిసాగర్ : వర్షాకాలాన్ని దృష్టిలో ఉంచుకొని నెల్లికల్ ఎత్తిపోతల పథకం పను ల ను సాధ్యమైనంత త్వరగా పూర్తి చే యాలని జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి ప్రాజక్ట్ ఇంజనీరింగ్ అధికారులను ఆదేశించారు.మంగళవారం ఆమె నల్గొండ జిల్లా తిరుమలగిరి సాగర్ మండలం నెల్లికల్ లో నిర్మిస్తున్న నె ల్లికల్ ఎత్తిపోతల పథకం పంపు హౌస్, పైప్ లైన్ నిర్మాణ పనులను తనిఖీ చేశారు.
వర్షం వల్ల పనులు ఆగిపోకుండా ముందే పూర్తి చేసే విధంగా ప్రాజెక్టు ఇంజనీరింగ్ అధికారులు, ప్రాజెక్టు ఏజెన్సీ చర్యలు తీసుకోవాలని, అ దే సమయంలో కార్మికుల భద్రతను దృష్టిలో ఉంచుకొని పనులు పూర్తి చేయాలని కలెక్టర్ చెప్పారు.
ప్రెషర్ మెయిన్ కు సంబంధించి భూసేకర ణ అవార్డు పాస్ చేయడమే కాకుం డా చెల్లింపులు సైతం చేయడం జ రుగుతున్నదని, ఈ పని సైతం త్వ రగా పూర్తి చేయాలన్నారు .గ్రావిటీ మెయిన్ కు సంబంధించి సర్వేను వేగవంతం చేయాలన్నారు.
కాగా నాగార్జునసాగర్ ప్రాజెక్టు జ లాల ఆధారంగా తిరుమలగిరి సా గర్ మండలం లోని గ్రామాలు, మరి కొన్ని గ్రామాలు కలిపి మొత్తం 11 గ్రామాలలో ని 24624 ఎకరాలకు సాగునీరు అందించేందుకు ఉద్దేశిం చి చేపట్టిన నెల్లికల్ ఎత్తిపోతల ప థకం పనులు శరవేగంగా నడుస్తు న్నాయి. ఈ పనుల్లో భాగంగా పంప్ హౌస్, పైపులైన్ పనులు కొనసాగు తున్నాయి. గ్రావిటీ మెయిన్ సర్వే పనులు నడుస్తుండగా, ప్రెస్సర్ మెయిన్ కు సంబంధించి భూసేకర ణ పూర్తయింది. మిర్యాలగూడ స బ్ కలెక్టర్ నారాయణ అమిత్, ప్రాజె క్టు డిప్యూటీ ఇంజనీర్ సీతారాం, అ సిస్టెంట్ ఇంజనీరు రవి, పెద్దఊర తహసిల్దార్ శ్రీనివాస్, ఏజెన్సీ ప్రతి నిధులు జిల్లా కలెక్టర్ వెంట ఉన్నా రు.