–స్థానిక సంస్థల ఇంచార్జ్ అదనపు కలెక్టర్ నారాయణ అమిత్
Collector Narayana Amit : ప్రజాదీవెన నల్గొండ : వనమహోత్సవం కింద ఆగస్టు 15 నాటికి ఆయా శాఖలు నిర్దేశించిన లక్ష్యం ప్రకారం మొక్కలు నాటే కార్యక్రమాన్ని పూర్తి చేయాలని స్థానిక సంస్థల ఇంచార్జ్ అదనపు కలెక్టర్, మిర్యాలగూడ సబ్ కలెక్టర్ నారాయణ అమిత్ అన్నారు.
గురువారం అయన జిల్లా కలెక్టర్ కార్యాలయంలోని సమావేశ మందిరంలో ఎంపీడీవోలతో వివిధ అంశాలపై వీక్షించారు.
వనమహోత్సవం కింద గుంతలు తవ్వడం, మొక్కలు నాటడం, ఆగస్టు 15 లోపు పూర్తి చేయాలన్నారు. సీజనల్ వ్యాధులు ప్రబలకుండా గ్రామాలలో పారిశుద్ధ్య కార్యక్రమాలు ముమ్మరం చేయాలన్నారు.
రానున్న స్థానిక సంస్థల ఎన్నికలను దృష్టిలో ఉంచుకొని సబ్ ఇన్స్పెక్టర్ల సహకారంతో సమస్యాత్మక అత్యంత సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలను గుర్తించాలన్నారు. ఈ సమీక్ష సమావేశానికి గృహ నిర్మాణ శాఖ పీడి రాజ్ కుమార్, డిఆర్డిఓ పిడి శేఖర్ రెడ్డి, డిపిఓ వెంకయ్య, జిల్లా పంచాయతీరాజ్ ఈఈ, జిల్లా పరిషత్ డిప్యూటీ సీఈఓ శ్రీనివాసరావు ఇతర అధికారులు, తదితరులు హాజరయ్యారు.