Welcome To Praja Deveena News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alert at prajadeveena.com

BJP and Congress: మాదంటే…మాదే ఆధిపత్యంపై ఆశలు

లోక్ సభ ఎన్నికల్లో తెలంగాణ ఓటర్లు కేంద్రం లో అధికారం ఎవరికి కట్టబెట్టను న్నారన్న చర్చోపచర్చలు జోరుగా సాగుతున్నాయి

మెజార్టీ సీట్ల సాధనపై ఆత్మవిశ్వా సం
రెండంకెల స్థానాలు తమవేనం టున్న కాంగ్రెస్‌, బిజెపి ల ధీమా
రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారం, మోదీ కరిష్మా పై గంపెడాశలు
మాకే డబుల్ డిజిట్ పక్కా అంటున్న గులాబి పార్టీ

ప్రజా దీవెన హైదరాబాద్‌: లోక్ సభ ఎన్నికల్లో(Lok sabha elections) తెలంగాణ ఓటర్లు కేంద్రం లో అధికారం ఎవరికి కట్టబెట్టను న్నారన్న చర్చోపచర్చలు జోరుగా సాగుతున్నాయి. ఓటరు మహా శయుడు తన సమాధానాన్ని సోమవారం ఈవీఎంలో రిజర్వు చేసేందుకు సంసిద్ధుడయ్యాడు. తెలంగాణలో ఆన్ని పార్టీల విస్తృత ప్రచారం ద్వారా ఓటరును ఏ పార్టీ ప్రసన్నం చేసుకుంటుంది అన్న సంశయం రాజకీయ పరిశీలకు ల్లో నెలకొంది. ఓటర్లను ఆకర్షించేం దుకు అన్ని ప్రయత్నాలూ చేసిన ప్రధాన పార్టీల నేతలు మాత్రం ఓటరు ఇచ్చే తీర్పు పట్ల ఎవరి ధీమాను వారు ప్రదర్శిస్తున్నారు.

రాష్ట్రంలోని 17 లోక్‌సభ సీట్లలో(Lok sabha elections) తాము 14 సీట్లను గెలుచుకుంటా మని ప్రకటించిన కాంగ్రెస్‌ పార్టీ తక్కువలో తక్కువ గా 11 స్థానాలు తమకే దక్కుతాయని, ఇక 2019 ఎన్నికల్లో నాలుగు ఎంపీ సీట్లు దక్కించుకున్న బీజేపీ ఈ దఫా రెండంకెల సీట్లను కచ్చితంగా సాధిస్తామని ధీమాగా చెబుతోంది. ఇక ఇటీవలి అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమిపాలు కావడంతో డీలా పడ్డ బీఆర్‌ఎస్‌ పార్టీ సైతం డబుల్ ధమాకా పక్కా అని నర్మగర్భంగా ప్రకటిస్తోంది. మాజీ సీఎం కేసీఆర్‌ తెలంగాణ సెంటిమెంట్‌ను మళ్లీ తెరపైకి తెచ్చి 12 నుంచి 14 సీట్లు ఇస్తే తెలంగాణ తడాఖా చూపెడతా మంటూ ఓటర్లను అభ్యర్థించారు.

అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచి ప్రభుత్వా న్ని ఏర్పాటు చేసిన ఉత్సాహంలో ఉన్న కాంగ్రెస్‌(Congress party) పార్టీ లోక్‌సభ ఎన్నిక ల్లోనూ ఆధిపత్యం ప్రదర్శిస్తామని ధీమా వ్యక్తం చేస్తోంది. రాహుల్‌ గాంధీ కరిష్మా, రేవంత్‌రెడ్డి ప్రభుత్వ పనితీరు, కాంగ్రెస్‌ పార్టీ పాంచ్‌ న్యా య్‌, పచ్చీస్‌ గ్యారెంటీలు తెలంగా ణ ఓటర్లలో సానుకూల వాతావర ణాన్ని తీసుకువచ్చాయని ఆ పార్టీ నేతలు నమ్ముతున్నారు. బీజేపీని గద్దె దించేందుకు దేశవ్యాప్తంగా ముస్లిం మైనారిటీలు ఇండియా కూటమి వైపునకు పోలరైజ్‌ కావడం తమకు కలిసివస్తుం దంటున్నారు. దీంతో పాటు బీజేపీ అధికారంలోకి వస్తే రాజ్యాంగాన్ని, రిజర్వేషన్లను రద్దు చేస్తుందంటూ రాహుల్‌గాంధీ, సీఎం రేవంత్‌రెడ్డి చేసిన ప్రచారం ఎస్సీ, ఎస్టీ, బీసీ వర్గాల్లోకి బలంగా వెళ్లిందని, ఈ వర్గాలు కూడా ఇప్పుడు కాంగ్రెస్‌ వైపే చూస్తున్నాయని అంటున్నారు.

అయినప్పటికీ పోల్‌ మేనేజ్‌మెంట్‌ విషయంలోనూ కాంగ్రెస్‌(congress) నాయక త్వం పకడ్బందీగా వ్యవహరిస్తోంది. ప్రతి పోలింగ్‌ బూత్‌కు ఒక కమిటీని వేసి ఓటరును పోలింగ్‌ బూత్‌ వరకు తీసుకెళ్లి ఓటు వేయించే బాధ్యతను అప్పగించింది. కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలు ఉన్నచోట్ల అసెంబ్లీ ఎన్నికలను మించి మెజారిటీలు రావాలని టార్గెట్లు కూడా విధిం చింది. క్షేత్రస్థాయిలో పార్టీ యంత్రాం గం గతంలో ఎన్నడూ లేనంత పట్టుదలగా పని చేస్తోందని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ఇక బిజెపి సైతం జాతీయ నేతల విస్తృత ప్ర చారం ద్వారా ఓటరును ఆకట్టు కునే ప్రయత్నం చేసింది. బిఆర్ఎస్ కూడా విస్త్రుత స్ధాయిలో ఓటరును ఆకట్టుకునేందుకు అవసరమైన మార్గాలన్నీoటిని వినియోగించింది. దీంతో తెలంగాణలో లోక్ సభ ఎన్నికల్లో ప్రస్పటమవుతున్న ముక్కోణపు పోటీలో ఎవరు పై చేయి సాధిస్తారో ఫలితాల వరకు వేచి చూడాల్సిందేనని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.

Congress and BJP big fight in Parliament elections