Bandi Sanjay kumar: కేసీఆర్ గుడిని మింగితే కాంగ్రెస్ పార్టీ గుడి లింగాన్ని కూడా మింగుతుంది
కెసిఆర్ గుడిని మింగితే కాంగ్రెస్ పార్టీ గుడి లింగాన్ని కూడామింగుతుందనిఅన్నారు.టిఆర్ఎస్ గవర్నమెంట్ లో నాపై 109 కేసులు పెట్టి పుణ్యానికి వడి కట్టారని అన్నారు.
డీఎస్సీ నిర్వహించకుండా మోసం మోసం చేసింది కేసీఆర్
టీఎస్పీఎస్సీ పేపర్ లీకేజ్ చేసింది కేసీఆర్
ఇంటర్మీడియట్ విద్యార్థుల ఆత్మహత్యకు కారకుడు అయింది కేసిఆర్
రెండు లక్షల ఉద్యోగాలు ఇస్తానని మోసంచేసిందికెసిఆర్:బండిసంజయ్
ప్రజాదీవెన,కోదాడ :నల్లగొండ,ఖమ్మం,వరంగల్ ఎమ్మెల్సీ నియోజకవర్గం(graduate mlc by elections) పట్టభద్రుల ఆత్మీయ సమ్మేళనం శుక్రవారం సూర్యాపేట జిల్లా అధ్యక్షులు బొబ్బా భాగ్యరెడ్డి అధ్యక్షతన స్థానిక కాశీనాదం ఫంక్షన్ హాల్ లో ఏర్పాటు చేసినారు.ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా భారతీయ జనతా పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి(National General Secretary of Bharatiya Janata Party Bandi Sanjay kumar) బండి సంజయ్ పాల్గొని మాట్లాడుతూ గత 30 ఏళ్లుగా మాతోపాటు ఎలాంటి ఆర్థిక లాభాలు ఆశించకుండా కొట్లాడిన వ్యక్తి గుజ్జుల ప్రేమేందర్ రెడ్డి(Gujjula Premender Reddy) కావున మొదటి ప్రాధాన్యత ప్రేమేందర్ రెడ్డి కివేసి శాసన మండలికి పంపినట్లయితే పట్టభద్రుల పక్షాన పోరాటం చేస్తాడని అన్నారు.
కెసిఆర్ గుడిని మింగితే కాంగ్రెస్ పార్టీ గుడి లింగాన్ని కూడామింగుతుందనిఅన్నారు.టిఆర్ఎస్ గవర్నమెంట్ లో నాపై 109 కేసులు పెట్టి పుణ్యానికి వడి కట్టారని అన్నారు.టిఆర్ఎస్ పై మేము కొట్లాడితే శాసనసభ ఎన్నికలలో కాంగ్రెస్(congress) కి ప్రజలు ఓటు వేసినారని అన్నారు.ఏందని ప్రజలను అడగగా 6 గ్యారంటీలతో మమ్మల్ని మోసం చేశారని వారు సమాధానం చెప్పారని అన్నారు.కెసిఆర్ ఉద్యమ సమయంలో బ్యాంకులో కారు లోను తీసుకొని లోను కట్టలేక బ్యాంకు వాళ్లు కారును జప్తి చేసినారు.అలాంటి కెసిఆర్ కి ఇప్పుడు కొన్ని వందల కోట్లు ఎలా వచ్చాయని అన్నారు.
కెసిఆర్ ఈ వందల కోట్లు తట్ట,పార మోసి సంపాదించలేదు అవి మన డబ్బులే అవి ఎట్టా రాబట్టుకోవాలో మనమే ఆలోచించాలని అన్నారు.ఆరు గ్యారెంటీ ల పేరుతో కాంగ్రెస్ పార్టీ మోసం చేసి ఎలా ఓట్లు వేయించుకున్నదో మళ్లీ ఎన్నికలలో కాంగ్రెస్ మాయమాటలకు మోసపోకండి అని కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన వాగ్దానాలన్నీటిని.అసెంబ్లీలో అడుగడుగునా అడ్డుకోవడానికి ఎనిమిది మంది బిజెపి ఎమ్మెల్యేలు ఉన్నారని గుర్తు చేశారు.టిఆర్ఎస్ కాంగ్రెస్(Congress) దొందు దొందే తెలంగాణ రాష్ట్రంలో బిజెపికి అనుకూల వాతావరణం వీస్తుందని అన్నారు. పట్రబుద్దుల ఎన్నికలలో ప్రేమేందర్ రెడ్డి కి మొదటి ప్రాధాన్యత ఓటు వేసి గెలిపించినట్లయితే శాసనమండలిలో ప్రశ్నించే గొంతుకగా నిరుద్యోగుల,ఉద్యోగుల పక్షాన పోరాటం చేస్తాడని అన్నారు కేంద్రం నిధులు సక్రమంగా అమలు కావాలంటే మన ప్రతినిధి అవసరం కావున శాసనమండలలో ప్రేమేందర్ రెడ్డినిగెలిపించాలనిఅన్నారు.
నిరుద్యోగులు,ఉద్యోగులు,రైతాంగం పక్షాన పోరాటం చేసింది బిజెపి(BJP) అని గుర్తు చేశారు.ఈ కార్యక్రమంలో రాష్ట్ర ప్రధానకార్యదర్శిసంకినేనివెంకటేశ్వరరావు,రాష్ట్ర ప్రచార కార్యదర్శి ప్రకాష్ రెడ్డి,రాష్ట్ర ఉపాధ్యక్షులు మనోహర్ రెడ్డి,ఉమ్మడి నల్లగొండ జిల్లా ఎంపీ అభ్యర్థి మాజీ ఎమ్మెల్యే శానంపూడి సైదిరెడ్డి,జిల్లా అధికార ప్రతినిధి పత్తిపాటి విజయ్,హైదరాబాద్ మాజీ మేయర్ సుభాష్ చంద్ర జి,బిజెపి రాష్ట్ర నాయకులు డాక్టర్ మల్లెబోయినఅంజియాదవ్,అక్కిరాజుయశ్వంత్,కనగాలవెంకటరామయ్య,కనగాల నారాయణ,నూనె సులోచన,బోలిశెట్టికృష్ణయ్య,వంగవీటి శ్రీనివాసరావు,కవితా రెడ్డి,శ్రీలత రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
Congress and BRS corruption in Telangana