–తెలంగాణపై కాంగ్రెస్, బిఆర్ఎస్ ప్రజలను తప్పుదోవపట్టించే ప్రయ త్నం
–అమరావతికి నిధులిస్తే మీకొచ్చిన ఇబ్బంది ఏమిటో చెప్పండి
–కొత్తగా సీఎం అయ్యారు, కొంత సంయమనంతో ఉండండి
–ఫక్తూ కేసీఆర్ బాటలోనే రేవంత్ ముందుకు వెళ్తున్నారు
–పదవుల కోసం పార్టీలు మారే వ్యక్తిని కానే కాదు మీ లాగ
–ఆరు హామీలు నెరవేర్చకుండా ప్రజలను మోసం చేస్తున్న రేవంతే రాజీనామా చేయాలి
–కేంద్ర మంత్రులు కిషన్‌రెడ్డి, బండి సంజయ్ ల ఎదురుదాడి
Congress-Brs: ప్రజా దీవెన, న్యూఢిల్లీ: తెలంగాణ రాష్ట్రానికి గడిచిన పదేళ్లలో ఎంతో చేశామని, భవిష్యత్తులోనూ మరెం తో చేస్తామని కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి జి. కిషన్ రెడ్డి (Kishan Reddy) తెలిపా రు. కేసీఆర్ కోసమో రేవంత్ రెడ్డి కోసమే తాము పనిచేయబోమని, 4 కోట్ల తెలంగాణ ప్రజలు, అమరుల ఆశయ సాధన కోసం పనిచేస్తామని చెప్పారు. బుధవారం ఢిల్లీలోని తన నివాసంలో కిషన్ రెడ్డి మీడియాతో మాట్లాడారు. తెలంగాణలోని 33 జిల్లాలకు 33 వేర్వేరు ప్రాజెక్టులు రాష్ట్ర బడ్జెట్లో ఇస్తారా అని ప్రశ్నిం చారు. ఏపీని ప్రత్యేక పరిస్థితి కింద పరి గణించి నిధులిచ్చామని, అమ రావతికి నిధులిస్తే మీకోచ్చిన ఇబ్బం దేమిటో ప్రజలకు చెప్పాలని ప్రశ్నిం చారు. రేవంత్ రెడ్డి కొత్తగా ముఖ్య మంత్రి అయ్యారని, సంయమనం తో పనిచేయాలని, అప్పుడే ఇంత ఉలికిపాటు ఎందుకని ధ్వజమెత్తా రు. రేవంత్ రెడ్డి కూడా ఫక్తూ కేసీఆ ర్ దారి లో వెళుతున్నారన్నారు.
కేసీఆర్ గజ్వేల్ డెవలప్ మెంట్ (KCR Gajwel Development) అథారిటీ పెట్టుకుంటే, రేవంత్ సీఎం కాగానే కొడంగల్ డెవలప్‌మెంట్ అథారిటీ పెట్టుకున్నారని విమ ర్శిం చారు. రాష్ట్రంలో కొత్త రేషన్ కార్డు లు ఇవ్వడం లేదని, కొత్త పించన్లు లేకపోగా పాత పించన్లకు ఇవ్వా ల్సిన డబ్బులు కూడా ఇవ్వడం లేదని విమర్శించారు. ఏం చేశారో చెప్పమంటే చేతకాదు కానీ కేంద్ర బడ్జెట్ పేరు చెప్పి అసెంబ్లీలో తీర్మా నం పెడతారా అంటూ మండిప డ్డారు. తాను అవసరం కోసం పార్టీ మార్చే వ్యక్తిని, అధికారం, పదవుల కోసం జెండా మార్చే ఆలోచన ఉన్నో డిని కాదని, డబ్బులిచ్చి సీఎం సీట్లు కొనుక్కోవడం కాంగ్రెస్ పార్టీ సంస్కృ తి అని, ఆ విషయం ప్రజలకు తెలు సన్నారు. తాను సికింద్రాబాద్ లోక్ సభ నియోజకవర్గం, తెలంగాణ ప్రజలకు, దేశానికి, తమ పార్టీకి బానిసని, అంతే తప్ప గాంధీ కు టుంబానికి బానిసను కాదని చెప్పా రు. రాజకీయాల్లోకి వచ్చినపుడు ఏ జెండా పట్టుకున్నానో తుది శ్వాసవ రకు అదే జెండాతో ఉంటానని స్ప ష్టం చేశారు. రాజీనామా చేయాల్సిం ది తాను కాదని, హామీలు అమలు చేయని రేవంత్ రెడ్డే రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. ఎక రానికి 18వేల చొప్పున 60 లక్షల మంది తెలంగాణ రైతులకు (farmers)ఎరు వుల సబ్సిడీ అందిస్తున్నామని తెలి పారు. 20లక్షల మంది రైతులనుం చి ధాన్యం సేకరణకు రూ.25వేల కోట్లు వెచ్చిస్తున్నామని చెప్పారు. లక్షా 32వేలతో చేపట్టిన జాతీయ రహదారులు తెలంగాణకు లబ్ధి చేయడం లేదా అని ప్రశ్నించారు. రామగుండం ఎన్టీపీసీ ఆధ్వర్యంలో 10,990 కోట్లతో 1600 మెగావాట్ల విద్యుత్ ప్రాజెక్టులు అందుబా టులోకి వచ్చాయని వివరించారు. రామగుండంలో (Ramagundam) 6300 కోట్లతో ఫర్టిలైజర్ కంపెనీ ఏర్పాటు చేశా మన్నారు. ఇవన్నీ దాచేసి అస త్యాలు ప్రచారం చేస్తున్నారని ఆయన మండిపడ్డారు.సింగరేణిని ప్రైవేటీకరించే ప్రసక్తే లేదని కిషన్ రెడ్డి చెప్పారు. బుధవారం లోక్‌సభ ప్రశ్నోత్తరాల సమయంలో పెద్దపల్లి కాంగ్రెస్ ఎంపీ గడ్డం వంశీకృష్ణ (Gaddam Vamsikrishna) అడి గిన ప్రశ్నకు ఆయన సమాధానమి చ్చారు. సింగరేణి ప్రైవేటీకరణ విష యంలో ఉద్దేశపూర్వకంగా కొందరు దుష్ప్రచారం చేస్తున్నారన్నారు. సిం గరేణి సంక్షేమానికి కేంద్రం కట్టుబడి ఉందని తెలిపారు. తెలంగాణ రాష్ట్ర విద్యుత్ ప్రయోజనాలను కాపాడే ఆలోచనతో అవసరమైన అన్ని చర్యలను కేంద్రం తీసుకుం టుందని పేర్కొన్నారు. ఇందులో భాగంగానే ఇటీవల ఒడిసాలోని నైనీ కోల్ బ్లాక్‌ను సింగరేణికి ఇవ్వ డంలో కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక చొ రవ తీసుకుందని ఆయనచెప్పారు.
మరో కేంద్ర మంత్రి బండి సంజయ్ (Bandi Sanjay) మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం బడ్జె ట్‌లో తెలంగాణకు అన్యాయం చేసిందంటూ కాంగ్రెస్, బీఆర్‌ఎస్ పార్టీలు అసెంబ్లీలో చేసిన తీర్మా నంపై కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి బండి సంజయ్ మండిప డ్డారు. ఆ తీర్మానం పొలిటికల్ బ్లాక్ పేపర్ అని విమర్శించారు. గత పదేళ్లలో కేంద్ర ప్రభుత్వం రాష్ట్రా భివృద్ధికి దాదాపు రూ.10 లక్షల కోట్ల నిధులు వెచ్చించిందనే స్పృహ కూడా లేకుండా నిందించడం విచా రకరమంటూ వ్యాఖ్యానించారు. భారతదేశంలో తెలంగాణ ఓ భాగ మనే విషయాన్ని మరిచి ముఖ్య మంత్రి, మంత్రులు, బీఆర్‌ఎస్, ఎంఐఎం (BRS, MIM) నేతలు మాట్లాడాటం అవకాశవాదానికి పరాకాష్ఠ అని సంజయ్ అన్నారు. కేంద్ర ప్రభుత్వ సహకారం లేకుండా రాష్ట్రంలోని ఏ పంచాయతీలోనైనా అభివృద్ధి జరి గిందని నిరూపించే దమ్ముందా అం టూ సీఎం రేవంత్ రెడ్డి, మాజీ సీఎం కేసీఆర్‌కు సవాల్ విసిరారు. అధికా రం చేపట్టిన వెంటనే బీఆర్‌ఎస్ పాలనపై శ్వేత పత్రాలు విడుదల చేసిన రాష్ట్ర ప్రభుత్వం కేంద్రం తెలంగాణకు ఖర్చు చేసిన నిధుల పైనా శ్వేత పత్రం విడుదల చేయా లని డిమాండ్ చేశారు. కేంద్రంపై కలిసి పోరాడతామంటూ కాంగ్రెస్, బీఆర్‌ఎస్ ఆడుతున్న డ్రామాలు చూస్తే ఆ రెండు పార్టీలు ఒక్కటేనని అర్థమవుతోందన్నారు. రాబోయే రోజుల్లో కాంగ్రెస్‌లో బీఆర్‌ఎస్ విలీ నానికి ఇది సంకేతమా అని ఎదు రుదాడికి దిగారు