Congress burrisrinivasreddy : ప్రజలందరికీ ఆమోదయోగ్యమైన నల్గొండ మాస్టర్ ప్లాన్
--తాజా మాజీ మాజీ మున్సిపల్ చైర్మన్ బుర్రి శ్రీనివాస్ రెడ్డి
ప్రజలందరికీ ఆమోదయోగ్యమైన నల్గొండ మాస్టర్ ప్లాన్
–తాజా మాజీ మాజీ మున్సిపల్ చైర్మన్ బుర్రి శ్రీనివాస్ రెడ్డి
Congress burrisrinivasreddy ప్రజా దీవెన, నల్లగొండ టౌన్: నల్లగొండ పట్టణ ప్రజలందరికీ ఆమో దకరంగా ఉండేలా త యారై న మాస్టర్ ప్లాన్ కు ప్రభుత్వం జీవోను విడుదల చేసిందని మాజీ ము న్సిపల్ చైర్మన్ బుర్రి శ్రీనివాస్ రెడ్డి, పట్టణ కాంగ్రెస్ అధ్య క్షుడు గుమ్ము ల మోహన్ రెడ్డి అన్నారు. శనివారం నల్లగొం డలోని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి క్యాంపు కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. 1987లో తయారైన మాస్టర్ ప్లాన్ ను పట్టణ మౌలిక అవసరాల మేరకు 2014లో రూ పొందించిన నూతన మాస్టర్ ప్లాన్ ను బిఆర్ ఎస్ ప్రభుత్వం ఆమో దం ఇవ్వకుండా కాలయాపన చేసిందని విమర్శించారు.
దీంతో నల్గొండ పట్టణ ప్రజలు ఎన్నో ఇబ్బందులు ఎదు ర్కున్నారని పేర్కొన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 132 మున్సిపాలిటీలు ఉంటే అందు లో 12 మున్సిపాలిటీ లలో నూతన మాస్టర్ ప్లాన్ ను రూపొందిం చాల్సిందిగా పైలెట్ ప్రాజెక్టుగా గత ప్రభుత్వం ఎంపిక చేసిందన్నా రు. అయితే గత బిఆర్ఎస్ ప్రభుత్వం రాష్ట్రంలో ఏ ఒక్క మున్సి పాలిటీ లో కూడా మాస్టర్ ప్లాన్ కు ఆమోదం తెలప కపోవడం నిర్లక్ష్యంగా వ్యవహరిం చిందని విమర్శించారు.
కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో కి వచ్చిన తర్వాత మంత్రి కోమటిరె డ్డి వెంక టరెడ్డి ప్రత్యేక చొరవతోనే నల్లగొండ మున్సిపాలిటీకి నూతన మాస్టర్ ప్లాన్ ఆమోదం లభించింది అన్నారు. మున్సిపల్ కార్మికుల కు గత నాలుగు నెలలుగా జీతాలు అందడం లేదని టిఆర్ఎస్ వ ర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అనడం విడ్డూరంగా ఉందన్నారు. రిజిస్ట్రే షన్ కార్యాలయం నుండి రావాల్సిన స్టాం ప్ డ్యూటీ 22 కోట్ల చెక్కు ను ట్రెజరీ కార్యాలయంలో అందజేయడం జరిగిందన్నారు.
బిఆర్ఎస్ అమల్లోకి తీసుకొచ్చిన ఈ కుబేర్ విధానం వల్లనే చెక్కు పాస్ కావడానికి సమయం పట్టిందని అన్నారు. అంతేగాని విష పూరిత ప్రచారాలు చేయవద్దని హితవు పలికారు. అనంతరం ము ఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి, మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఫ్లెక్సీ లతో పాలాభిషేకం చేసి ధన్య వాదాలు తెలిపారు. విలేకరుల సమా వేశం లో మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్ అబ్బగోని రమేష్ గౌడ్, మాజీ కౌన్సి లర్లు ఖయ్యూం బేగ్, ఇంతియాజ్ , నాయకులు సమ్మద్, జూల కంటి శ్రీనివాస్, అమీర్ తదితరులు ఉన్నారు.