Congress govt promises: హామీ మేరకు హామీలన్నీ నెరవేర్చాలి
సీపీఐ (ఎం) రాష్ట్ర కమిటీ సమావేశం గురువారం చెరుపల్లి సీతారాము లు అధ్యక్షతన జరిగింది. పోలిట్ బ్యూరో సభ్యులు బివి రాఘవులు పాల్గొని పార్లమెంట్ ఎన్నికలు, దేశ రాజకీయ పరిణామాలు వివరిం చారు.
సీపీఐ(ఎం) రాష్ట్ర కమిటీ సమావేశం తీర్మానం
ప్రజా దీవెన, హైదరాబాద్: సీపీఐ (ఎం) రాష్ట్ర కమిటీ సమావేశం(CPI (M) State Committee meeting) గురువారం చెరుపల్లి సీతారాము లు అధ్యక్షతన జరిగింది. పోలిట్ బ్యూరో సభ్యులు బివి రాఘవులు పాల్గొని పార్లమెంట్ ఎన్నికలు, దేశ రాజకీయ పరిణామాలు వివరిం చారు. సమావేశం క్రింది తీర్మానం చేశారు. సమావేశ తీర్మానాలు ఇలా ఉన్నాయి, కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల ప్రణాళికలో ఇచ్చిన హామీ ప్రకారం వ్యవసాయ కూలీలకు, మ హిళలకు ఆర్థిక సహాయం చేయా లని, కౌలు రైతులకు ఈ వానా కాలం నుండే రైతు భరోసా అమలు చేయాలని, పంటల బీమా పథకాన్ని(Crop Insurance Scheme) రైతాంగానికి ఉపయోగపడే విధంగా బీమా ప్రీమియాన్ని ప్రభు త్వమే భరించి అమలు చేయాలని, ధరణి(Dharani) సమస్యలు పరిష్కరించా లని, రు.2లక్షల లోపు రుణమాఫీ అమలు చేయాలని, ప్రభుత్వం హామి ఇచ్చిన విధంగా ధాన్యానికి, ఇతర పంటలకు బోనస్ ఇవ్వాలని, వ్యవసాయ ప్రణాళిక వెంటనే ప్రకటించాలని, విద్యార్థుల ఫీజు రియంబర్స్‌మెంట్స్ బకాయిలు విడుదల చేయాలని డిమాండ్ చేశారు.వ
ప్రభుత్వం హామి ఇచ్చిన విధంగా నిరుద్యోగ భృతి ఇవ్వాలని, జాబ్ క్యాలెండర్ ప్రకటించి ఖాళీ పోస్టులన్నింటినీ భర్తీ చేయాలని, విత్తనాలు, ఎరువులు, రుణసౌకర్యం కల్పించాలని, గుడి సెలు వేసుకున్న పేదలందరికీ పట్టా లిచ్చి ఇంటి నిర్మాణానికి ఇందిరమ్మ పథకం క్రింద ఆర్థిక సహాయం చేయాలని, అటవీ హక్కుల చట్టం ప్రకారం అర్హులైనందరికీ హక్కు పత్రాలివ్వాలని, ఉద్యోగుల అన్ని రకాల బకాయిలు విడుదల చేయా లని, భారత కమ్యూనిస్టు పార్టీ (మార్క్సిస్టు)(communist party of india (marxist) symbol) తెలంగాణ రాష్ట్ర కమిటీ సమావేశం రాష్ట్ర ప్రభు త్వాన్ని డిమాండ్ చేస్తున్నది. కాంగ్రెస్ ఎన్నికల మ్యానిఫెస్టోలో వ్యవసాయ కూలీలకు ఏటా రు.12వేలు ఆర్థిక సహకారం చేస్తామని, మహిళలకు నెలకు రు.2500లు ఇస్తామని హామి ఇచ్చింది. రాష్ట్రంలో 20లక్షల మందికి పైగా కౌలురైతులు 30 శాతానికి పైగా వ్యవసాయం చేస్తున్నారు.
రైతుల ఆత్మహత్యల్లో సగంమంది కౌలు రైతులే. 2011 చట్ట ప్రకారం లోన్ ఎలిజిబులిటీ కార్డులివ్వాలి. ప్రజాపాలనలో ఒక కోటి 30 లక్షల దరఖాస్తులు రాగా, అందులో 70వేలు భూమి సమ స్యలే. ఈ ధరణి సమస్యలమీద ఇప్పటికే క్షేత్రస్థాయి విచారణ పూర్తయ్యింది. ప్రభుత్వం దగ్గరే పెండిరగ్ ఉన్నది. తక్షణమే ప్రభు త్వం విధాన నిర్ణయం చేసి సమ స్యను పరిష్కరించాలి. గత మూ డేళ్ళుగా రాష్ట్రంలో వ్యవసాయ ప్రణాళికలు ప్రకటించలేదు. ఫలి తంగా రైతులు ఏపంటలు వేయాలో స్పష్టత లేక తీవ్రంగా నష్టపోతు న్నా రు. ఇప్పటికైనా తక్షణమే వ్యవసా య ప్రణాళిక ప్రకటించాలి. రాష్ట్ర మంత్రి తుమ్మల నాగేశ్వ రరావు గారి ప్రకటన ప్రకారం ఈ ఖరీఫ్‌లో 70లక్షల ఎకరాల్లో పత్తి, 60లక్షల ఎకరాల్లో వరి పండిరచబోతున్నా రు. అంటే పప్పులు, నూనెలు, ము తకధాన్యాలకు కేవలం 10లక్షల ఎకరాలే మిగులుతాయి. ఇవి అనేక సమస్యలకు దారితీస్తాయి. అందుకే రాష్ట్ర ప్రభుత్వం తక్షణం వ్యవసా య ప్రణాళిక ప్రకటించి, రైతులకు తగిన సూచనలు ఇవ్వాలి. గత రెండు సంవత్సరాలుగా రాష్ట్రంలో పంటల బీమా సౌకర్యం లేదు. ప్రీమి యం మొత్తం ప్రభుత్వమే చెల్లించే విధంగా పంటల బీమా అమలు చేయాలని, సన్నదాన్యాని కే కాకుం డా దొడ్డు ధాన్యానికి కూడా బోనస్ ఇవ్వాలని, ఇతర పంటలకు కూడా బోనస్ ఇవ్వాలని సీపీఐ(ఎం) కోరుతున్నది.ప్రభుత్వం ఇచ్చిన హామీ ప్రకారం రు.2లక్షల వరకు రుణాన్ని ఏకకాలంలో మాఫీ చేయా లి.
రుణమాఫీ వెంటనే అమలుచే యగలిగితే వానాకాలం సాగు పెట్టు బడికి రైతులకు ఉపయోగం జరుగు తుంది. లేనిఎడల రైతులు ప్రైవేట్ వడ్డీ వ్యాపారుల దగ్గర అధిక వడ్డీ లకు అప్పులు తెచ్చుకోవాల్సి వస్తుంది. ఆగస్టులోనే రుణమాఫీ చేయాలనుకుంటే ఇప్పుడున్న అప్పులతో నిమిత్తం లేకుండా రైతులకు కొత్తగా రుణాలివ్వాలి. లీడ్ బ్యాంక్ ఇందుకనుగుణంగా రుణ ప్రణాళిక ప్రకటించే విధంగా రాష్ట్ర ప్రభుత్వం తగు చర్యలు తీసుకోవాలి.రాష్ట్రంలో విద్యార్థుల ఫీజు రీయంబర్స్‌మెంట్ బకాయిలు(Student Fee Reimbursement Arrears) వెంటనే విడుదల చేయాలి. గత బకాయిలు విడుదల చేయకపో వడంతో విద్యా సంవత్సరం ప్రారం భం కావడంతో విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
ఉద్యోగుల సప్లిమెంటరీ బిల్లులు, గ్రాట్యుటీ, ప్రభుత్వ జీవిత బీమా, జిపిఎఫ్, సరెండర్ లీవ్స్, కమ్యూటే షన్ వంటి బిల్లులు దీర్ఘకాలంగా పెండిరగ్‌లో ఉన్నాయి. గ్రామపంచా యితీ కార్మికులకు 6నుండి 9నెలల వేతనం, మున్సిపల్ కార్మికులకు 3నెలలు, ప్రభుత్వ హాస్పిటల్స్‌లో పనిచేస్తున్న కాంట్రాక్ట్ కార్మికులకు 5నెలల బకాయిలు, వైద్యరంగంలో 104ఉద్యోగులకు 8నెలల బకా యిలున్నాయి. షెడ్యూల్డ్ ఎంప్లాయీస్(scheduled employment industries) పరిశ్రమల్లో పనిచేసే కార్మి కుల వేతనాల సమస్య తీవ్రంగా ఉంది. కావున ప్రభుత్వం తక్షణమే వేతనాలు చెల్లించి, ఉద్యోగుల సమస్యలు పరిష్కరించాలని, కనీసవేతనాల డ్రాఫ్ట్ జారీలో జరిగిన లోపాలను సరిదిద్ది, పెరుగుతున్న ధరలకనుగుణంగా జీతాలను సవరించాలని సిపిఐ(ఎం) రాష్ట్ర కమిటీ సమావేశం ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నది. నీట్ పరీక్షలో జరిగిన అవకతవకలపై న్యాయ విచారణ జరిపించాలని కేంద్ర ప్రభుత్వాన్ని సమావేశం డిమాండ్ చేస్తున్నదని వెల్లడించారు.
Congress govt promise fulfilled