Welcome To Praja Deveena News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alert at prajadeveena.com

Prajavani: పాలనాపరమైన అడ్డంకులు తొలిగాయి

సార్వత్రిక ఎన్నికల ప్రక్రియ ముగి యడంతో పాలనాపరమైన అడ్డంకు లు తొలగాయని ప్రజావాణిలో అందిన దరఖాస్తులను వెంటనే పరిష్కరిస్తామని రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షులు డా. చిన్నా రెడ్డి తెలిపారు. మహాత్మా జ్యోతిబా పూలే ప్రజాభవన్ లో శుక్రవారం నుండి పునః ప్రారంభమైన ప్రజావా ణి కార్యక్రమంలో చిన్నారెడ్డి పాల్గొని దరఖాస్తులను స్వీకరించారు.

కోడ్ ముగియడంతో ప్రజావాణి కి మార్గం సుగమం
రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్య క్షులు డా చిన్నా రెడ్డి

ప్రజా దీవెన, హైదరాబాద్ : సార్వత్రిక ఎన్నికల( parliament elections) ప్రక్రియ ముగి యడంతో పాలనాపరమైన అడ్డంకు లు తొలగాయని ప్రజావాణిలో(Prajavani) అందిన దరఖాస్తులను వెంటనే పరిష్కరిస్తామని రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షులు డా. చిన్నా రెడ్డి తెలిపారు. మహాత్మా జ్యోతిబా పూలే ప్రజాభవన్ లో(Mahatma Jyotiba Phule Praja Bhavan) శుక్రవారం నుండి పునః ప్రారంభమైన ప్రజావా ణి కార్యక్రమంలో చిన్నారెడ్డి పాల్గొని దరఖాస్తులను స్వీకరించారు. ఎన్ని కల ప్రవర్తనా నియమావళి అమలు కారణంగా సుమారు 3 నెలల సుదీ ర్ఘ విరామం తరువాత ప్రారంభమైన ప్రజావాణి కార్యక్రమానికి ప్రజలు అధిక సంఖ్యలో హాజరై తమ సమస్యలను అధికారులకు వివరిం చారు.

అన్ని విభాగాలకు సంబందిం చి మొత్తం 373 దరఖాస్తులు నమో దయ్యాయి. రెవెన్యూ పరమైన సమస్యలకు సంబంధించి 120 దరఖాస్తులు, విధ్యా శాఖకు సంబం దించి 43, మున్సిపల్ శాఖకు సం బందించి 43, హోం శాఖకు సం బం దించి 29, పౌరసరఫరాల శాఖకు సంబందించి 18, ఇతర శాఖలకు సంబందించి 120 దరఖాస్తులు అందినట్లు ప్రజావాణి అధికార వర్గాలు తెలిపాయి. ప్రజావాణి(Prajavani) ప్రత్యేక అధికారి, మున్సిపల్ శాఖ సంచాలకులు శ్రీమతి దివ్య, ఇతర అధికారులు ప్రజల నుండి వచ్చిన దరఖాస్తులు స్వీకరించండం తో పాటు వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు.

Congress govt ruling after parliament elections