Congress leader d srinivas : డి. శ్రీనివాస్ ఇక లేరు
--మాజీ మంత్రి ధర్మపురి శ్రీనివాస్ కన్నుమూత -- పలువురు ప్రముఖుల సంతాపం, నివాళులు
డి. శ్రీనివాస్ ఇక లేరు
–మాజీ మంత్రి ధర్మపురి శ్రీనివాస్ కన్నుమూత
— పలువురు ప్రముఖుల సంతాపం, నివాళులు
ప్రజా దీవెన, హైదరాబాద్: ఉమ్మడి ఆంద్రప్రదేశ్ పీసీసీ అధ్యక్షునిగా, మంత్రిగా పలు శాఖలకు ప్రాతి నిధ్యం వహించిన ది. శ్రీనివాస్ ( d srinivas) తుది శ్వాస విడిచారు. గత కొంతకాలంగా అనారోగ్యం తో బాధపడుతున్న ఆయన తెల్లవారుజామున 3 గంటల ప్రాంతంలో గుండెపోటుతో తుది శ్వాస విడిచినట్లు కుటుంబ సభ్యులు వెల్ల డిం చారు.
డి.శ్రీనివాస్ ఉమ్మడి ఏపీలో మంత్రిగా, ఎంపీగా, పీసీసీ ( pcc) అధ్య క్షుడిగా పనిచేశారు. ప్రస్తుతం ఆయన రెండో కుమారుడు ధర్మపురి అర్వింద్ నిజామాబాద్ ఎంపీ ( mp aravindh) కొనసాగుతున్నా రు. పెద్దకుమారుడు సంజయ్ గతంలో నిజామాబాద్ మేయర్ గా పని చేశారు అనారోగ్యంతో బాధప డుతున్న డీఎస్ హైదరాబాద్ సిటీ న్యూరో ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందారు.
ఇదిలా ఉండ గా వైఎస్, డీఎస్ కాంబినేషన్ లో కాంగ్రెస్ ( congre ss) పార్టీ విజయాలు సాధించిందని నానుడి. ఆయన 1948 సెప్టెం బర్ 27న నిజామాబాద్ (nizamabad) లో జన్మించారు. ఉమ్మ డి ఏపీ క్యాబి నేట్ లో మంత్రిగా చేసిన ధర్మపురి శ్రీనివాస్ 1998లో పీసీసీ అధ్యక్షు డిగా బాధ్యతలు చేపట్టిన డీఎస్ 1989, 1999, 2004లో ఎమ్మెల్యే గా గెలిచిన డీఎ స్ 2014 తర్వాత బీఆర్‌ఎస్‌లో చేరారు. డి.శ్రీనివాస్ రాజ్యసభ బీఆర్‌ఎస్ ఎంపీగా ( mp) కూడా కొనసాగారు.
*పలువురు ప్రముఖుల సంతాపం..* డి. శ్రీనివాస్ మృతి పట్ల ఉభయ తెలుగు రాష్ట్రాలకు చెంది న పలువురు ప్రముఖులు సంతా పం తెలియజేశారు. ప్రధానంగా ఆయన మరణం కాంగ్రెస్ పార్టీకి తీరని లోటని సీఎం ( CM revanth reddy) రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ( batti vikramarka) , ఇతర నేతలు పేర్కొన్నారు. ఏపీ పీసీసీ మాజీ అధ్యక్షుడు, మాజీ మంత్రి డి. శ్రీనివాస్ అకాల మరణం కాంగ్రెస్ పార్టీకి తీరని లోటన్నారు. కాంగ్రెస్ పార్టీ భావజాలాన్ని తెలుగు రాష్ట్రాల్లో విస్తరింపజేసిన కీలక నేత ల్లో డి. శ్రీనివాస్ ఒకరని స్మరించు కున్నారు.
రాజకీయ దురందుడు, ఉన్నత విద్యావంతుడు, బడుగుల సంక్షేమం కోసం ఆయన కృషి చేశా రని తెలిపారు. పార్టీలో వివిధ స్థా యిల్లో, సుదీర్ఘ కాలం పాటు ఆయ నతో కలిసి పనిచేసిన సందర్భాల ను వారు గుర్తు చేసుకు న్నారు. డి శ్రీనివాస్ మృతి పట్ల వారి కుటుంబ సభ్యులకు, ప్రగాఢ సానుభూతి సంతాపం తెలియజేశారు.
Congress leader d srinivas