వాహన ర్యాలీని ప్రారంభించిన పట్టణ కాంగ్రెస్ అధ్యక్షుడు గుమ్ముల, మాజీ మున్సిపల్ చైర్మన్ బుర్రి
Kharge Meeting : ప్రజాదీవెన నల్గొండ టౌన్ : హైదరాబాదులోని ఎల్బీ స్టేడియంలో ఎఐసిసి అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్కే శుక్రవారం నిర్వహించిన సమావేశానికి నల్గొండ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ పార్టీ శ్రేణులు పెద్ద సంఖ్యలో తరలి వెళ్లారు. నల్గొండ పట్టణంలోని మర్రిగూడ బైపాస్ వద్ద పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు గుమ్ముల మోహన్ రెడ్డి, మాజీ మున్సిపల్ చైర్మన్ బుర్రి శ్రీనివాస్ రెడ్డి జెండా ఊపి హైదరాబాదుకు తరలి వెళ్లే వాహన ర్యాలీని ప్రారంభించారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ హైదరాబాదులోని ఎల్బీ స్టేడియంలో ఎఐసిసి అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే స్థానిక సంస్థలకు సంబంధించి నిర్వహించే సమావేశంలో గ్రామస్థాయి, మండల స్థాయి, జిల్లాస్థాయి నేతలంతా పాల్గొంటున్నారని తెలిపారు. మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి నాయకత్వంలో పార్టీ శ్రేణులు అంతా కలిసి ఈ సమావేశానికి వెళుతున్నట్లు తెలిపారు.
రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను అర్హులైన ప్రజలకు అందే విధంగా పార్టీ శ్రేణులు కృషి చేస్తున్నారని తెలిపారు. ఈ కార్యక్రమంలో మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్ అబ్బగోని రమేష్ గౌడ్, మాజీ జెడ్పిటిసి వంగూరి లక్ష్మయ్య, మార్కెట్ కమిటీ చైర్మన్ జూకురి రమేష్, పలువురు మాజీ కౌన్సిలర్లు, మాజీ సర్పంచులు,,మాజీ ఎంపిటిసిలు, కాంగ్రెస్ పార్టీ నాయకులు,యూత్ కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు.