Congress Paduri Shankar Reddy : ప్రజాదీవెన శాలిగౌరారం ఫిబ్రవరి 13: కాంగ్రెస్ పార్టీ ఎన్నికల్లో ఇచ్చిన హామీలను అంచె అంచెలు గా అమలు చేస్తుందని శాలిగౌరారం వ్యవసాయం మార్కెట్ కమిటీ ఛైర్మెన్ పాదూరి శంకర్ రెడ్డి అన్నారు. గురువారం శాలిగౌరారం ఛైర్మెన్ శంకర్ రెడ్డి విలేకరుల తో మాట్లాడుతూ గతంలో ఏ ప్రభుత్వం చేయని విధంగా కాంగ్రెస్ ప్రభుత్వం రైతులకు 2 లక్షల రుణ మాఫీ చేసిందని,మిగిలిన వారికి కూడా రుణ మాఫీ చేస్తుందని అన్నారు.
రైతు భరోసా కూడా అంచేలoచెలుగా చేస్తుందని చెప్పారు.ప్రతి పక్షాలు ప్రజలను గందరగోళం పరుస్తుందన్నారు.రానున్న అన్ని ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ విజయం సాధిస్తున్నదని శంకర్ రెడ్డి ధీమా వ్యక్తం చేశారు.