Congress party: ప్రజా దీవెన, కోదాడ:మండల పరిధిలోని కూచిపూడి గ్రామంలోని గ్రామపంచాయతీ కార్యాలయంలో వరద బాధితులకు కాంగ్రెస్ పార్టీ (Congress party) ఆధ్వర్యంలో ఆదివారం నిత్యవసర వస్తువుల పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆ పార్టీ మండల అధ్యక్షులు తూమాటి వరప్రసాద్ రెడ్డి (Tumati Varaprasad Reddy)మాట్లాడుతూ స్థానిక ఎమ్మెల్యే ఉత్తం పద్మావతి రెడ్డి ఆదేశాల మేరకు నిత్యవసర సరుకులు పంపిణీ చేశామన్నారు. ఎమ్మెల్యే ఉత్తం పద్మావతి రెడ్డి (Padmavati Reddy)వరదబాధితులనుఆదుకునేందుకుసాయి శక్తుల కృషి చేస్తోందని అన్నారు. ప్రభుత్వ ఉద్యోగులు అందరితో సమీక్షలు నిర్వహిస్తూ ప్రజలు, రైతులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా తగు చర్యలు చేపట్టారనిఅన్నారు. ఈ కార్యక్రమంలో మండల నాయకులు ఇర్ల సీతారo రెడ్డి , రేవురి వెంకటాచారి, పిఎసిఎస్ చైర్మన్ ఓ. శ్రీనివాస్ రెడ్డి, శరభయ్య , రెడ్డిపూడి అనంత రామయ్య , శెట్టి పూర్ణచంద్రరావు ,శెట్టి నాంచారయ్య , డైరెక్టర్ శెట్టి శ్రీనివాసరావు , చేప తిరపయ్య , చేతుల రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు.
Sign in
Sign in
Recover your password.
A password will be e-mailed to you.