Welcome To Praja Deveena News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alert at prajadeveena.com

Reservations: రిజర్వేషన్ లపై కాంగ్రెస్ కాలకూటవిషo చిమ్ముతోoది

బీజేపీ అధికారంలోకి వస్తే ఎస్సీ, ఎస్టీ రిజర్వేషన్లను రద్దు చేస్తారం టూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలను బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఎంపీ బండి సంజయ్ కుమార్ తీవ్రంగా ఖండించారు.

ఆరు గ్యారంటీల అమలుపై ప్రజల ద్రుష్టిని మళ్లించేందుకు డ్రామాలు
బిసి, ఎస్సీ, ఎస్టీల్లో భయాందోళన లు సృష్టించి లబ్ది పొందేందుకు యత్నం
అంబేద్కర్ రాజ్యాంగాన్ని అవమా నించింది, రిజర్వేషన్ లకు తూట్లు పొడిచింది కాంగ్రెస్ పార్టీయే
మతపరమైన రిజర్వేషన్లను మా త్రమే బిజెపి రద్దు చేసి తీరుతుంది
స్వదేశీ బీజేపీకి, విదేశీ కాంగ్రెస్కు మధ్య జరుగుతున్న పోరాటమిది
ఎస్సీ, ఎస్టీలకు పారిశ్రామివేత్తలను చేయడమే మోదీ సర్కార్ లక్ష్యం
హుజూరాబాద్ లో ఇంటింటికీ బీజేపీ పేరుతో సంజయ్ ఎన్నికల ప్రచారం

ప్రజా దీవెన, హుజూరాబాద్: బీజేపీ అధికారంలోకి వస్తే ఎస్సీ, ఎస్టీ రిజర్వేషన్లను(SC and ST Reservations) రద్దు చేస్తారం టూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలను బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఎంపీ బండి సంజయ్ కుమార్(MP Bandi Sanjay kumar) తీవ్రంగా ఖండించారు. బిసి, ఎస్సీ, ఎస్టీల్లో భయాందోళనలు స్రుష్టించి రాజకీ యలబ్ది పొందడానికి కాంగ్రెస్ చేస్తున్న విష ప్రచారంలో భాగమే సీఎం రేవంత్ వ్యాఖ్యలని అన్నారు.

వంద రోజుల్లో 6 గ్యారంటీలను అమలు చేస్తామని మోసం చేసిన కాంగ్రెస్ పార్టీపై ప్రజలు ఆగ్రహంతో ఉండటంతో వారి ద్రుష్టిని మళ్లించేం దుకు ఆడుతున్న రాజకీయ డ్రామా అని విమర్శంచారు. రాజ్యాంగాన్ని తూ.చ తప్పకుండా అమలు చేసే పార్టీ బీజేపీ అని, ఎస్సీ, ఎస్టీ, రిజ ర్వేషన్లను కొనసాగిస్తామని స్పష్టం చేశారు. మతపరమైన రిజర్వేషన్ల కు రాజ్యాంగం వ్యతిరేకమైనప్పటికీ సుప్రీంకోర్టు తీర్పులను సైతం ధిక్క రించి ముస్లింలకు రిజర్వేషన్లు అమలు చేస్తున్న పార్టీ కాంగ్రెస్ అని మండిపడ్డారు.

బీజేపీ అధికారం లోకి వస్తే రాజ్యంగం ప్రకారం ముస్లిం రిజర్వేషన్లను(Muslim reservations) రద్దు చేసి వాటిని ఎస్సీ, ఎస్టీ, బీసీలతోపాటు అగ్రవర్ణా ల్లోని పేదలకు పంచి తీరు తామని ప్రకటించారు. రాజ్యాంగాన్ని మారు స్తామని కేసీఆర్ ప్రకటిస్తే కనీసం నో రు మెదపని కాంగ్రెస్ నేతలు అంబే ద్కర్ ను అడుగడుగునా అవమనిం చారన్నారు. అంబేద్కర్ ను ఓడిం చడంతోపాటు అంబేద్కర్ చనిపోతే ఆయన పార్దివ దేహాన్ని ఢిల్లీలో ఉం చకుండా ముంబయికి పంపించి న నీచమైన పార్టీ కాంగ్రెస్సేనని మండి పడ్డారు. ఎన్నికల ప్రచారంలో భాగం గా ఆదివారం ఉదయం హుజూ రాబాద్ విచ్చేసిన బండి సంజయ్ ‘ఇంటింటికీ బీజేపీ’ పేరుతో ఇంటిం టికీ వెళ్లి ఓట్లను అభ్యర్ధిస్తూ కరప్రతాలను అందజేశారు.

మోదీ ప్రభుత్వ విజయాలను వివరిస్తూ,. మళ్లీ మోదీయే అధికారంలోకి రావాల్సిన ఆవశ్యకతను వివరిస్తూ ప్రచారం నిర్వహించారు. అనంతరం మీడియాతో మాట్లాడారు. ఆయన మాటల్లోనే…ఎన్నికల ప్రచారంలో భాగంగా కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గంలో ‘ఇంటింటికీ బీజేపీ’ పేరుతో ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్నాం. అందులో భాగంగా హుజూరాబాద్ లో నేను ఇంటింటికీ వెళ్లి ఓట్లను అభ్యర్ధించా ను. మోదీ ప్రభుత్వ విజయాలను, ఎంపీగా చేసిన అభివ్రుద్ది, ప్రజా సమస్యలపై చేసిన పోరాటాలతో కూడిన కరపత్రాలను ఇంటింటికీ పంపిణీ చేస్తున్నాం. కాంగ్రెస్, బీఆర్ ఎస్ ఏనాడూ ప్రజల కోసం పనిచే యలేదు. ప్రజలు కష్టాల్లో ఉంటే భరోసా ఇవ్వలే.

బీఆర్ఎస్ అభ్యర్ధి వినోద్ కుమార్ ఏనాడూ జనం గురించి పట్టించుకోలేదు. లేఖలు రాసుడు, హైదరాబాద్ లో ఉండటం తప్ప సాధించిందేమీ లేదు. కరీంన గర్, వరంగల్, ఎల్కతుర్తి, సిద్దిపేట రోడ్డు విస్తరణ నిధులు ఎవరి హయాంలో వచ్చాయి? ఎవరి హయాంలో మోదీ వచ్చి పనులను ప్రారంభించారు. ఎవరి హయాంలో పనులు శరవేగంగా జరుగుతున్నా యో ప్రజలకు తెలియదా? అసలు కాంగ్రెస్ అభ్యర్ధి ఎవరో కూడా తెల్వదు. నేను పక్కా లోకల్. బీఆర్ఎస్ అభ్యర్ధి పక్కా నాన్ లోకల్. కరీంనగర్ కు కేంద్రం ఇచ్చిన నిధులను కేసీఆర్ దారి మళ్లిస్తే నోరు విప్పలే. కరీంనగర్ ప్రజలు బాధల్లో ఉంటే ఏనాడూ పట్టించుకోలే. కేసీఆర్ కు దోచి పెట్టడం, తన కుటుంబానికి దాచి పెట్టడం తప్ప సాధించిందేమీ లేదు.. అకాల వర్షాలతో రైతులు పంట నష్టపోతే ఎన్నడైనా కేసీఆర్ ను కలిసి సాయం చేయించారా? ఇప్పుడు కూడా రైతులు పంట నష్టపోయి కొందరు, వడ్లు కొనుగోలు కేంద్రాల్లో మరికొందరు ఇబ్బందులు పడుతుంటే ఎందుకు లేఖలు రాయలేదు.

కాంగ్రెస్ అభ్యర్ధి ఎవరో ప్రజలకు తెలియదు. మీడియాకు అయినా తెలుసా? కాంగ్రెస్ నేతలకు కూడా తెల్వదు. రాహుల్ గాంధీని కాంగ్రెస్ కార్యకర్తలు ప్రధాని చేయాలను కుంటే ఆయన మాత్రం సీఎం చేయాలనుకుంటున్నడు.. అసలు ఆయన లోకలా, నాన్ లోకలా, కూడా తెల్వదు. ఆ పార్టీ కార్యకర్తలే పూర్తి అయోమయంలో ఉన్నరు. ఈ విషయం తెలిసే కాంగ్రెస్ నేతలు నన్ను తిట్టి, రాముడి అక్షింతలను వివాదం చేసి రాజకీయ లబ్ది పొందా లనుకుంటున్నరు. నేను ప్రజల కోసం కొట్లాడిన. వందల కేసులు పెట్టినా భయపడలే. జైలు కు పోయిన. కాంగ్రెస్, బీఆర్ఎస్ అభ్యర్థులెన్నడైనా పోరాటాలు చేశారా? ప్రజల పక్షాన కొట్లాడి దెబ్బలు తిన్నరా? జైలుకు పోయారా? ..కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీ ఎన్నికల్లో ఇచ్చిన 6 గ్యారంటీలను ఎందుకు అమలు చేయలేదు? మహిళలకు నెలనెలా రూ.2500 లు ఇచ్చారా? రైతులకు రూ.500 బోనస్ ఇచ్చారా? ఎకరాకు రూ.15 వేలు రైతు భరోసా ఇచ్చారా? ఇల్లు లేనోళ్లకు ఇంటిజాగా, రూ. 5లక్షలిచ్చారా? విద్యార్థులకు రూ. 5లక్షల భరోసా కార్డు ఇచ్చారా? వ్రుద్దులు, వితంతవులకు రూ.4 వేల పెన్షన్ ఇస్తున్నారా?… మరి ఏం చూసి కాంగ్రెస్ కు ఓటేయాలి. అందుకే కాంగ్రెస్, బీజేపీ కార్యకర్తలు సైతం జెండాలు, ఎజెండాలను పక్కనపెట్టి ఈసారి మోదీ ప్రభుత్వం రావాలి.

బండి సంజయ్ గెలవాలని భావిస్తున్నరు. ఓడిపోతామనే భయం తో కాంగ్రెస్ పార్టీ(Congress Party) బీజేపీ అధికారంలోకి వస్తే ఎస్సీ, ఎస్టీల రిజర్వేషన్లను రద్దు చేస్తుందని విష ప్రచారం చేస్తోంది. పచ్చి అబద్దా లాడుతోంది. ఇలాంటి తప్పుడు ప్రచారం చేయడం పూర్తిగా పేదలను మోసం చేయడమే.

అంబేద్కర్ ను అవమానించిందే కాంగ్రెస్. ఆ పార్టీ విదేశీ పార్టీ. బ్రిటోషోడు స్థాపించిన పార్టీ. బీజేపీ స్వదేశీ పార్టీ. గాంధీ ఆలోచనలను, అంబేద్కర్ ఆశయాలను, దీన్ దయాళ్, శ్యామా ప్రసాద్ ముఖర్జీ సిద్దాంతాలను అమలు చేస్తున్న పార్టీ బీజేపీ.ఎమర్జెన్సీ విధించి రాజ్యాంగాన్ని అవమానించింది కాంగ్రెస్. అంబేద్కర్ ను అడుగడు గునా అవమానించింది కాంగ్రెస్. అంబేద్కర్ ను కుట్రలు చేసి ఓడించి పరాభవించిన పార్టీ కాంగ్రెస్. చివరకు అంబేద్కర్ చనిపోతే ఆయన పార్ధివదేహాన్ని ఢిల్లీలో కాకుండా ముంబయికి పంపించింది కాంగ్రెస్. మతపరమైన రిజర్వేషన్లకు రాజ్యాంగం వ్యతిరేకమైనప్పటికీ, ముస్లిం రిజర్వేషన్లను తెచ్చి రాజ్యాంగాన్ని అవమానించిన పార్టీ కాంగ్రెస్.

గతంలో ఎస్సీ, ఎస్టీ రిజర్వేషన్లకు కేటాయించిన ఖాళీల్లో అర్హులు లేకుండా కాంగ్రెస్ హయాంలో జనరల్ కేటగిరి అభ్యర్థులతో నింపి రిజర్వేషన్లను తూట్లు పొడిచిన పార్టీ కాంగ్రెస్. కానీ ఎస్సీ, ఎస్టీ లకు కేటాయించిన రిజర్వేషన్లు వాళ్లకే చెందాలని పకడ్బందీగా చట్టం తెచ్చిన పార్టీ బీజేపీ.

దళితులను ఏటా 1.25 లక్షల మంది పారిశ్రామికవేత్తలుగా మారుస్తూ ఉద్యోగాల కోసం కాకుండా ఉద్యోగాలు ఇచ్చే వారిగా తీర్చిదిద్దుతున్న ఏకైక పార్టీ బీజేపీ. విద్యార్థులకు మెరిట్ స్కాలర్ షాప్ ల కోసం ఒక్క ఏడాదిలోనే రూ.59 వేల కోట్లు కేటాయించిన ప్రభుత్వం మోదీదే. రామ్ నాథ్ కోవింద్, ద్రౌపది ముర్మును రాష్ట్రపతి చేసిన పార్టీ బీజేపీ. రాజ్యాంగాన్ని తూ.చ తప్పకుండా అమలు చేస్తోంది బీజేపీ.. రాజ్యంగానికి తూట్లు పొడిచింది కాంగ్రెస్.
కాంగ్రెస్ పార్టీ జిన్నా ఆలోచనలను అమలు చేస్తోంది. సుప్రీంకోర్టు వద్దన్నా మతపరమైన రిజర్వేషన్లు తెచ్చి పేదల పొట్టకొట్టింది కాంగ్రెస్. రాజ్యాంగాన్ని మార్చేస్తామని కేసీఆర్ ప్రకటిస్తే నోరు మెదపని పార్టీ కాంగ్రెస్. ఆనాడు కేసీఆర్ పై తిరుగుబాటు చేసి పోరాడింది బీజేపీ. పోడు భూములపై పోరాడింది బీజేపీ. దళిత సమస్యలపై పోరాడింది బీజేపీ.

అమిత్ షా ముస్లిం రిజర్వేషన్లను రద్దు చేసి పేదలకు అందజేస్తామని ప్రకటిస్తే… కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియాలో ముస్లిం అనే పదాన్ని తొలగించి రిజర్వేషన్లనే రద్దు చేస్తామన్నట్లుగా అమిత్ షా పేరుతో దుష్ప్రచారం చేయడం సిగ్గు చేటు.. మోదీ అధికారంలోకి వచ్చి 10 ఏళ్లయింది. మేం రిజర్వేషన్లు ఎక్కడ ఎత్తివేశామో చెప్పాలి?
,
అధికారంలోకి వస్తే మతపరమైన రిజర్వేషన్లను పక్కా రద్దు చేసి తీరుతాం. వాటిని పేదలకు పంచుతాం. దయచేసి ముఖ్యమంత్రిసహా కాంగ్రెస్ నేతలను కోరుతున్నా.. ఎస్సీ, ఎస్టీల మనోభావాలను దెబ్బతీసేలా, భయానక వాతావరణం స్రుష్టించేలా రాజకీయాలు చేయొద్దని కోరుతున్నా. 6 గ్యారంటీల అమలుపై ప్రజల ద్రుష్టిని మళ్లించేందుకు చేసిన కుట్ర ఇది… ఆర్ఎస్ఎస్ సర్ సంచాలక్ మోహన్ భగవత్ చేసిన ప్రసంగం వీడియోను చూపిస్తే… రిజర్వేషన్లు సమస్య కానేకాదు.. రాజకీయ పార్టీలకే సమస్ వస్తోందని మోహన్ భగవత్ అన్నారు.. అదే జరుగుతోంది.

congress party insulted reservations