Welcome To Praja Deveena News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alert at prajadeveena.com

Bhatti Vikramarka:పార్లమెంటు ఎన్నికల్లో పధ్నాలుగు స్థానాల్లో పాగా

పార్లమెంటు ఎన్నికల్లో రాష్ట్రంలో 12 నుంచి 14 స్థానాలు కాంగ్రెస్ గెలుచుకోబో తుందని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అన్నారు.

తెలంగాణ డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క

ప్రజా దీవెన, మంథని: పార్లమెంటు ఎన్నికల్లో(Parliamentary elections) రాష్ట్రంలో 12 నుంచి 14 స్థానాలు కాంగ్రెస్ గెలుచుకోబో తుందని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అన్నారు. మంగళవారం ఆయన మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు, మంచిర్యాల ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు, పెద్దపల్లి ఎమ్మెల్యే విజయ రమణారావు, ధర్మపురి ఎమ్మెల్యే లక్ష్మణ్ , రామగుండం ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ సింగ్, భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు. మీడియా సమావేశానికి ముందు మంత్రి శ్రీధర్ బాబు స్వ గ్రామమైన మంథని మం డలం ధన్వాడలో వివిధ దేవాల యాల మూడో వార్షికోత్సవం సంద ర్భంగా పూజా కార్యక్రమాల్లో పాల్గొ ని వేద పండితుల ఆశీర్వచనం స్వీకరించారు.

మిత్రుడు శ్రీధర్ బాబు ఆహ్వానం మేరకు పూజా కార్యక్రమాల్లో పాల్గొనడం అదృ ష్టంగా భావిస్తున్నామని, ధన్వాడలో పర్యటనతో ఈరోజు ధన్యమైందని డిప్యూటీ సీఎం తన ఆనందాన్ని వ్యక్తం చేశారు. కాంగ్రెస్ పార్టీ అభ్య ర్థుల గెలుపు కోసం సాధారణ ఎన్ని కల్లో పార్టీ శ్రేణులు ఎండ వేడిని లెక్కచేయకుండా తీవ్రంగా శ్రమించా రని, వారందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు తెలిపారు. దేశంలో, రాష్ట్రంలో ప్రజాస్వామ్యాన్ని, దేశ సంపదను, రాజ్యాంగాన్ని కాపాడేం దుకు ఎన్నికల్లో(election)దేశ ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. వారికి కాంగ్రెస్ పార్టీ పక్షాన ధన్యవాదాలు తెలియ జేశారు.

ఈ ప్రపంచంలో అతిపెద్ద లౌకికదేశంగా భారతదేశ అన్ని నిలబెట్టేందుకు యువ నేత రాహు ల్ గాంధీ తీవ్రంగా శ్రమించారు. కన్యాకుమారి నుంచి కాశ్మీర్(Kashmir) వరకు పాదయాత్ర, మణిపూర్ నుంచి మహారాష్ట్ర వరకు బస్సు యాత్ర చేసిన విషయాన్ని ఆయన వివరిం చారు. ఎన్నికల ఫలితాల తదుపరి రాహుల్ గాంధీ(Rahul Gandhi) సుదీర్ఘ పోరాట ఫలి తాలు కనిపిస్తాయి అన్నారు.ఇండియా కూటమి అధికారంలోకి వస్తుంది దేశ సంపద ప్రజలకు పంచుతుంది , ఆర్థిక, సామాజిక, భావజాలాన్ని కోల్పోయిన బిజెపి వారి మీద వారికి నమ్మకం లేక ఇతర అంశాలను జొప్పిస్తున్నారు . అయినప్పటికీ ప్రజలు నిలబడి ఇండియా కూటమిని గెలిపిం చబోతున్నారని తెలిపారు.

Congress win 14 Parliament seats