Conservation of plants:ప్రజా దీవెన, కోదాడ: మానవ మనుగడకు మొక్కలు జీవనాధారం అని అందుకు ప్రతి ఒక్కరూ మొక్కల పరిరక్షణ బాధ్యత తీసుకోవాలని కోదాడ మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ (Motor Vehicle Inspector) జిలాని మై హోమ్ ఎస్టేట్ యాజమాన్యం సంయుక్తంగా గురువారం స్థానిక మై హోమ్ ఎస్టేట్ నందు వనమహోత్సవ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ నాటిన ప్రతి మొక్కను (plants)చెట్టుగా ఎదిగేందుకు సంరక్షణ బాధ్యత తీసుకోవాలని వారు సూచించారు మొక్కలను సంరక్షించినట్లయితే అవి పెరిగి పెద్దవై మానవ మనుగడకు జీవనాధారం అవుతాయని తెలిపారు. ఈ కార్యక్రమంలో భాగంగా సుమారు 300 మొక్కలను నాటారు. ఈ కార్యక్రమంలో మేనేజర్ చెరుకు అశోక్ . భాస్కర్ ముత్యాలు విష్ణువర్ధన్ రావు బాలు ప్రవీణ. పోలీసులు.డ్రైవర్లు సిబ్బంది పాల్గొన్నారు
Sign in
Sign in
Recover your password.
A password will be e-mailed to you.