మిస్ ఫైరింగ్ తో కానిస్టేబుల్ లైఫ్ మిస్
ప్రజా దీవెన/హైదరాబాద్: హైదరాబాద్ నగరంలోని హుస్సేనీ ఆలం పోలీస్ స్టేషన్ పరిధిలో ప్రమాదవశాత్తు తుపాకీ మిస్ ఫైరింగ్ జరిగింది.
కబుతర్ఖాన ప్రాంతంలో రాత్రి విధులు ముగిసిన తర్వాత నిద్రకు ఉపక్రమించగా హెడ్ కానిస్టేబుల్ భూపతి శ్రీకాంత్ చేతిలోని తుపాకీ తెల్లవారుజామున మిస్ ఫైర్ కావడంతో అతడు తీవ్రంగా గాయపడ్డాడు.
తీవ్ర గాయాలపాలైన హెడ్ కానిస్టేబుల్‌ను చికిత్స నిమిత్తం ఉస్మానియా ఆస్పత్రికి తరలించగా అక్కడ చికిత్స పొందుతూ ఆయన మృతిచెందారు. అంతకుముందు ఘటనా స్థలాన్ని దక్షిణ మండలం డీసీపీ సాయి చైతన్య పరిశీలించారు.