Nagam Varshith Reddy : ప్రజా దీవెన,దేవరకొండ:
భారతీయ జనతా పార్టీ దేవరకొండ నియోజకవర్గ కార్యాలయంలో అసెంబ్లీ కన్వీనర్ AT. కృష్ణ అధ్యక్షతన స్థానిక సంస్థల ముఖ్య నాయకుల సమావేశంనిర్వహించడం జరిగింది ,ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మాజీ ఎంపీ నల్లగొండ జిల్లా ఎన్నికల ప్రబారి శ్రీ బూర నర్సయ్య గౌడ్ , జిల్లా అధ్యక్షులు నాగం వర్షిత్ రెడ్డి , మాజీ MLA సైదిరెడ్డి , ఎన్నికల ఇంచార్జ్ వీరెల్లిచంద్రశేఖర్ లు పాల్గొన్నారు.. ఈ సందర్భంగా బూరు నరసయ్య గౌడ్ మాట్లాడుతూ మండల పరిధిలోనీ అన్ని గ్రామాలలో రాబోయే స్థానిక సంస్థల ఎన్నికలలో బిజెపి పార్టీ అభ్యర్థులు ప్రతి గ్రామంలో కాషాయ జెండా ఎగర వేసేలా కృషి చేయాలని కార్యకర్తలకు పిలుపునిచ్చారు. ఎప్పుడు ఎన్నికలు వచ్చినా ప్రజలంతా బిజెపి పార్టీ అభ్యర్థులను గెలిపించడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారని అన్నారు,ప్రతి గ్రామములో రాష్ట్ర ,జిల్లా మండల నాయకులు బూత్ అధ్యక్షులు ప్రతి ఒక్కరూ స్థానిక ఎన్నికలలో ప్రతి గ్రామంలో ఎంపీటీసీ స్థానాలలో పోటీ చేయడానికి సిద్ధంగా ఉండాలని కోరారు భారత ప్రభుత్వము గత 11 సంవత్సరాల నుంచి మన దేశ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఆధ్వర్యంలో అభివృద్ధిలో ముందుకు వెళ్తుంది అన్నారు మరియు
ప్రతి గ్రామములోని కేంద్ర ప్రభుత్వ పథకాలు గురించి తెలియపరచాలని కార్యకర్తలను కోరారు అదేవిధంగా కాంగ్రెస్ ప్రభుత్వము చెప్పిన హామీలు ప్రజలకు అన్యాయం చేసిందని గత ప్రభుత్వంతో పాటు కాంగ్రెస్ ప్రభుత్వానికి బుద్ధి చెప్పాలని తెలంగాణ రాష్ట్రాన్ని అప్పుల కుప్పలు పాలు చేస్తున్న ఈ యొక్క పాలకులను బుద్ధి చెప్పేలాగా ప్రజలు అందరూ ఈసారి స్థానిక ఎలక్షన్లు భారతీయ జనతా పార్టీని గెలిపించాలని ప్రజలను కోరారు కేంద్రం నుండి వచ్చిన గ్రామ పంచాయతీలోని అభివృద్ధి చేస్తున్న ఏకైక ప్రభుత్వం భారత ప్రభుత్వం అది నరేంద్ర మోడీ యొక్క ఆధ్వర్యంలోనే ఈరోజు గ్రామాలలో అనేక సంక్షేమ పథకాలు అందే లాగా చేస్తున్న ప్రభుత్వం బిజెపి కాబట్టి ఈసారి బిజెపి నీ అత్యధిక మెజారిటీతో గెలిపించాలని వారన్నారు ఈ కార్యక్రమంలో బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యులు కర్నాటి సురేష్ , బిజెపి సీనియర్ నాయకులు నక్క వెంకటేష్ యాదవ్ ,బిజెపి జిల్లా ప్రధాన కార్యదర్శి చెనమొని రాములు, జిల్లా ఉపాధ్యక్షులు వానం నరేందర్ రెడ్డి, ఎస్టీ మోర్చ రాష్ట్ర నాయకులు వినోద్ రాథోడ్, ఎస్సీ మోర్చా రాష్ట్ర ఉపాధ్యక్షులు అంకురి నరసింహ, వివిధ మండల అధ్యక్ష ప్రధాన కార్యదర్శిలు, వివిధ మోర్చాల రాష్ట్ర జిల్లా నాయకులు, తదితరులు పాల్గొన్నారు.