Gutha Sukhender Reddy : మండలి చైర్మన్ మనస్తాపం, రాజకీ య నాయకులు వాడే బాష బాధాక రమన్న గుత్తా సుఖేందర్ రెడ్డి
Gutha Sukhender Reddy : ప్రజా దీవెన నల్లగొండ: రాష్ట్రంలో రాజకీయ నాయకులు వాడే భాష చాలా బాధాకరమని శాసనమం డలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. ప్రతిపక్ష, అధికార పక్షాలు తప్పుడు బాషను వాడి ప్రజల ఈసడింపుకు గురి కా వొద్దoటూ హితవు పలికారు. రా జ్యాంగ పదవులను గౌరవించాల్సిన బాధ్యత అందరిపై ఉందని సూచిం చారు. సోమవారం ఆయన స్థాని కంగా ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడారు.
ఎన్నికలలో వేల కోట్లు డబ్బులు ఖ ర్చుపెడుతున్నారని, దాoతో అన్ని రాష్ట్రాల రాజకీయాల్లో అవినీతి పెరిగిపోతుందని ఆందోళన వ్యక్తం చేశారు. అదే సందర్భంలో రాష్ట్ర ప్ర భుత్వాలు ఇచ్చే ఉచితాలు కూడా నియంత్రించాల్సిన అవసరం ఉం దని స్పష్టం చేశారు. తెలంగాణలో ఇతర రాష్ట్రాల వ్యక్తులు అన్ని ప నులలో ఎక్కువగా ఉన్నారని గుర్తు చేశారు.
వ్యవసాయ కూలీలు కూడా భీహార్ లాంటి రాష్ట్రాల నుండి వస్తున్నార ని, ప్రభుత్వం వైపుకు పథకాల కో సం ప్రజలు ఎదురుచూసే పరిస్థితి ఉండొద్దని పేర్కొన్నారు. ఉచితాలు తగ్గించి ప్రజలకు ఉపాధి కల్పించా లని, రాజకీయ పార్టీల వైఖరితో అ ధికారుల్లో అవినీతి పెరిగిందని ఆరో పించారు. జయలలిత, రాజశేఖర్ రెడ్డి లాంటి వాళ్లు వెంట ఏమి తీసు కుపోలేదని అన్నారు. ఎన్నికల సం ఘం,సుప్రీం కోర్టు, కేంద్రం అవినీతిపై దృష్టి సారించాలి. ఎన్నికల్లో ఖర్చు చేసి విషయంలో కఠిన నిర్ణయం తీ సుకోవాలని అప్పీల్ చేశారు.
ఆయకట్టుకు నీటి విడుదల శు భపరిణామం…. నాగార్జున సాగ ర్ ఆయకట్టుకు ముందుగానే నీటి విడుదల చేయడం శుభ పరిణామ మని పేర్కొన్నారు. రాష్ట్ర ముఖ్య మంత్రి, ఇరిగేషన్ శాఖ ఉత్తమ్ కు మార్ రెడ్డి లకు ధన్యవాదాలు తెలి పారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో మ ద్రాస్ కు నీళ్లు తీసుకుపోవడానికి ప్రాజెక్ట్ ల అనుసంధానం జరిగింద న్నారు. ఇచ్చంపల్లి నుండి నాగార్జు న సాగర్ కు నీళ్లు వస్తే తెలంగాణ కు మేలు జరుగుతుందని చెప్పారు.
బనకచర్ల ప్రాజెక్ట్ ను తెలంగాణ గట్టి గా వ్యతిరేకిస్తుందని, బనకచర్ల ద్వా రా తెలంగాణకి నష్టం జరుగుతుం దని తెలిపారు.
ఇద్దరు ఎమ్మెల్సీల తీరు బాధాక రం… శాసన మండలి సభ్యులు తీన్మార్ మల్లన్న,కల్వకుంట్ల కవిత పిర్యాదులు అందాయని, అయితే ఇద్దరు ఎమ్మెల్సీల వ్యవహారం నా కు బాధను కలిగించిందని గుర్తు చే శారు. చట్టపరంగా నా కర్తవ్యాన్ని నేను నిర్వహిస్తానని స్పష్టం చేశారు.