Welcome To Praja Deveena News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alert at prajadeveena.com

CP Srinivasa Reddy:మహంకాళి దేవాలయాన్ని సంద ర్శించిన సీపీ శ్రీనివాస రెడ్డి

CP Srinivasa Reddy:ప్రజా దీవెన హైదరాబాద్: హైదరాబాద్ లాల్ దర్వాజా సింహవాహిని (Hyderabad Lal Darwaja Simhavahini) శ్రీ మహాంకాళి దేవాలయo, అక్కన్న మాదన్న దేవాలయాలను హైదరాబాద్ కమిషనర్ ఆఫ్ పోలీస్ శ్రీనివాస్ రెడ్డి (CP Srinivasa Reddy) దర్శించారు. బోనాల పండుగ సంద ర్బంగా చేస్తున్న బందోబస్తు, భద్ర తా, ట్రాఫిక్ ఏర్పాట్లను పరిశీలించా రు. ఈ సందర్బంగా కమీషనర్ కొత్త కోట శ్రీనివాసరెడ్డి CP Srinivasa Reddyమాట్లాడుతూ ముందుగా భక్తులందరి కి బోనాల పండుగ శుభాకాంక్షలు తెలిపి నా రు. ఈ రోజు లాల్ దర్వాజా సింహ వాహిని మహాంకాళి దేవాలయoలో బోనాల పండుగ సందర్భంగా ఆన వాయితిగా వస్తున్న ఆలయ శిఖర పూజా, ధ్వజారోహణ నిర్వహిం చినందుకు చాలా సంతోషంగా ఉందని అన్నారు.

లాల్ దర్వాజా అమ్మవారి ఆశీస్సులు (Blessings of Goddess Lal Darwaja) అందరిపై ఉండాలని, తెలంగాణ రాష్ట్రం చా లా వేగంగా అభివృద్ది చెంది , ప్రజ లు సుఖ సంతోషాలతో ఉండాలని నేను కోరుకుంటున్నానని తెలిపా రు. రాబోయే బోనాల పండుగ సందర్బంగా అంబారి ఊరేగింపు కు హైదారాబాదు సిటీ పోలీసు తర పున 1000 పోలీసు అధికారులు, సిబ్బందితో కట్టుదిట్టమైన భద్రత, బందోబస్తు ఏర్పాట్లు నిర్వహి స్తామ ని చెప్పారు. ఇతర ప్రభుత్వ శాఖల సమన్వయముతో భక్తులకు ఎలాం టి అసౌకర్యం కలుగ కుండా చూస్తా ము అని తెలిపినారు. స్నేహా మెహ్రా ఐపిఎస్ డిసిపి సౌత్ జోన్ .ఆర్ వెంకటేశ్వర్లు డిసిపి ట్రాఫిక్ (traffic), మరియు ఇతర అధికారులు పాల్గొన్నారు.