–రాచకొండ సీపీ సుధీర్ బాబు
CP Sudhir Babu : ప్రజా దీవెన హైదరాబాద్: కీసరగు ట్ట బ్రహ్మోత్సావాల సందర్భంగా ఎటువంటి అవాంఛనీయ సంఘ టనలు లేకుండా, ప్రశాంతంగా జరి గేందుకు తీసుకోవలసిన భద్ర తాప రమైన చర్యలు మరియు భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా చేయాల్సిన బందోబస్తు ఏర్పాట్ల గు. రించి రాచకొండ కమిషనర్ సుధీర్ బాబు ఐపీఎస్ నేరేడ్ మెట్ లోని రాచకొండ కార్యాలయంలో వివిధ ప్రభుత్వ శాఖల అధికారుల తో సమన్వయ సమావేశం నిర్వ హించారు. ఈ కార్యక్రమంలో వి ద్యుత్ శాఖ, వైద్యం, రోడ్లు & భవ నాలు, మునిసిపల్, దేవాదాయ శాఖల నుండి సంబంధిత అధికారు లు పాల్గొన్నారు.ఈ కార్యక్రమంలో కమిషనర్ మాట్లాడుతూ బ్రహ్మో త్సావాల సమయంలో భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చే అవకా శం ఉండడం వల్ల కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేయాలని అధి కారులను ఆదేశించారు. ప్రజాప్ర తినిధులు, విఐపీలతో పాటు సా ధారణ భక్తులకు కూడా ఎటువంటి ఇబ్బందులు లేకుండా జాగ్రత్తలు తీసుకోవాలని, మహిళా భక్తులు, పిల్లలు, వృద్ధుల కోసం ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాలని సూచిం చారు. వైద్యబృందం అప్రమత్తంగా ఉండాలని, అత్యవసర పరిస్థితుల్లో ప్రజల సౌకర్యార్థం డాక్టర్ల బృందం తో పాటు అంబులెన్సును, బీపీ షు గర్ వంటి వాటితో పాటు ఇతర అత్యవసర మందులు కూడా అం దుబాటులో ఉంచాలని సూచించా రు. సురక్షితమైన తాగునీరుతో పాటు వేసవి తాపానికి కొందరు వడదెబ్బకు గురయ్యే ప్రమాదం ఉంది కాబట్టి ఓఆర్ఎస్ ప్యాకెట్లు విస్తృతంగా అందుబాటులో ఉం చాలని సూచించారు. పారిశు ధ్య ఏర్పాట్లు సక్రమంగా ఉండాలని, మహిళల కోసం ప్రత్యేకంగా మొబై ల్ టాయిలెట్లు ఏర్పాటు చేసేలా చూడాలని సంబంధిత అధికారుల కు సూచించారు.
కీసర బ్రహ్మోత్స వాలు జరిగే ప్రాంతంలో మద్యపా నం మరియు అమ్మకం రెండిటి నిషేధాన్ని అధికారులు సక్రమంగా అమలు చేయాలని, గుట్ట ప్రాంతం లో ప్రాణాంతకమైన పాములు సం చరించే అవకాశం ఉంది కాబట్టి పాములు పట్టే వాళ్లను మరియు ఆలయ సమీపంలోని చెరువు వద్ద కొందరు భక్తులు ప్రమాదవశాత్తు చెరువులో పడే అవకాశం ఉంది కాబట్టి గజ ఈతగాళ్ళను అందు బాటులో ఉంచాలని సూచించారు. ట్రాఫిక్ అధికారులు భారీ సంఖ్యలో వచ్చే వివిధ రకాల వాహనాలను క్రమపద్ధతిలో పార్కింగ్ చేయడాని కి ఏర్పాట్లు చేయాలని, తగిన సం ఖ్యలో బారికేడ్లు, సైన్ బోర్డులు ఏర్పాటు చేయాలని, డ్రంకెన్ డ్రై వింగ్ టెస్టులు నిర్వహించాలని సూచించారు. ఆలయ ప్రాంగణం లో అన్ని వైపులా సిసిటీవీ కెమెరా లను ఏర్పాటు చేయాలని, కమాం డ్ కంట్రోల్ అధికారులు ఎప్పటిక ప్పుడు పరిస్థితిని సమీక్షిస్తూ ఉండా లని, మహిళా భక్తుల రక్షణ కోసం షీ టీం బృందాలు కూడా విధుల్లో ఉండాలని పేర్కొన్నారు. నిరంతరా య విద్యుత్ సరఫరా ఉండేలా చూడాలని, ఎటువంటి అగ్ని ప్రమా దాలు జరగకుండా ఫైర్ సేఫ్టీ అధికా రులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఆలయ ప్రాంగణం లో ఏర్పాటు చేసే లైట్ల వైరింగ్ వ్య వస్థ వల్ల విద్యుత్ షాక్ వంటి ప్రమాదాలు జరగకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. భారీ సంఖ్యలో భక్తులు దైవదర్శనం కోసం వచ్చే అవకాశం ఉంది కాబ ట్టి ఎటువంటి అవాంఛనీయ సంఘ టనలు జరగకుండా పోలీసుశాఖ తో పాటు అన్ని ప్రభుత్వ శాఖల సంబంధిత అధికారులు సమన్వ యంతో పనిచేసి బ్రహ్మోత్సవాలు ప్రశాంతంగా జరిగేలా చూడాలని కమిషనర్ సూచించారు. ఈ కా ర్యక్రమంలో మల్కాజ్ గిరి డిసిపి పివి పద్మజ ఐపిఎస్, డిసిపి క్రైమ్ అరవింద్ బాబు, డీసీపీ స్పెషల్ బ్రాంచ్ జి.నరసింహారెడ్డి, డిసిపి అడ్మిన్ ఇందిర, డిసిపి ఎస్ఓటి రమణారెడ్డి, డీసీపీ ట్రాఫిక్ మల్లా రెడ్డి, డిసిపి శ్యామ్, డీసీపీ సైబర్ క్రైమ్స్ నాగలక్ష్మి, అదనపు డీసీపీ అడ్మిన్ శివకుమార్, ఇతర ప్రభు త్వ శాఖల అధికారులు పాల్గొన్నా రు.