CPI:ప్రజా దీవెన, కోదాడ: కమ్యూనిజంలో చైతన్య దీపికలు నారాయణపురం ప్రజలని సిపిఐ (CPI) రాష్ట్ర కార్యవర్గ సభ్యులు గన్నా చంద్రశేఖర్ (Ganna Chandrasekhar) అన్నారు.గురువారం చిలుకూరు మండలం నారాయణపురంలో సిపిఐ నిర్మాణ సభ నిర్వహించారు.ఈ సభకు ముఖ్యఅతిథిగా గన్నా చంద్రశేఖర్ (Ganna Chandrasekhar)పాల్గొని మాట్లాడారు తెలంగాణ సాయుధ పోరాట చరిత్రలో. నిలిచిపోతుందని తెలిపారు ఈ పోరాటంలో ఈ ప్రాంతం నుండి అనేకమంది కమ్యూనిస్టు నాయకులు కార్యకర్తలు పాలుపంచుకున్నారని.దేశంలో మారిన పరిస్థితుల కనుగుణంగా బూర్జువా రాజకీయ పార్టీలు నాయకులు చరిత్రను వక్రీకరించి సాయిధ పోరాటాన్ని తక్కువ చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.
పేద ప్రజల (Poor people) హక్కుల కోసం సాయిధ పోరాటంలో ఎంతోమంది కమ్యూనిస్టు నాయకులు కార్యకర్తలు అమరులైన విషయాన్ని గుర్తు చేశారు..దేశంలో నేటికీ సంపద అతి కొద్ది మంది చేతుల్లోనే కేంద్రీకృతమైందన్నవిషయాన్నిమరవరాదని తెలిపారు పేదల చరిత్రను వక్రీకరించేవాళ్లే కమ్యూనిస్టులను తక్కువచేస్తారనిపేదప్రజలుఉన్నంతకాలంకమ్యూనిజంఉంటుందన్నారు.సామాన్యుల సమస్యలపై కమ్యూనిస్టు పార్టీలు నిరంతరం పోరాటలు కొనసాగిస్తూనే ఉంటాయని తెలిపారు.ఈ సమావేశంలో జిల్లా కార్యదర్శి బెజవాడ వెంకటేశ్వర్లు (Secretary Bejawada Venkateshwarlu),జిల్లా కార్యవర్గ సభ్యులు మండవ వెంకటేశ్వర్లు,జిల్లా గీతా పనివారాల సంఘం కార్యదర్శి కొండ కోటయ్య,వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా అధ్యక్షులు రెమిడాల రాజు,జెర్రిపోతుల గూడెంమాజీ సర్పంచ్’నంద్యాల రామిరెడ్డి,మాజీ ఎంపీటీసీ కందుకూరి వెంకటి,గ్రామ శాఖ కార్యదర్శి మీసాల శీను,మండల కార్యవర్గ సభ్యులు కీసర కొండలు తదితరులు పాల్గొన్నారు