పీడిత ప్రజల విముక్తి కి సిపిఐ (ఎంఎల్)
మార్క్సిస్టు మహా ఉపాధ్యాయులు కామ్రేడ్ లెనిన్ 154వ జయంతితో పాటు సిపిఐ (ఎం-ఎల్) 55వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా నల్లగొండ పట్టణంలోని సిపిఐ (ఎంఎల్) న్యూడెమోక్రసీ జిల్లా కార్యాలయం శ్రామిక భవన్ లో ఎర్రజెండా ఎగురవేసి అమరవీ రులకు నివాళులు అర్పించారు.
55వ ఆవిర్భావ దినోత్సవం సంద ర్భంగా సిపిఐ (ఎం-ఎల్) న్యూడె మోక్రసీ జిల్లా కార్యదర్శి ఇందూరు సాగర్
ప్రజా దీవెన, నల్లగొండ టౌన్: మార్క్సిస్టు మహా ఉపాధ్యాయులు కామ్రేడ్ లెనిన్ 154వ జయంతితో పాటు సిపిఐ (ఎం-ఎల్) 55వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా నల్లగొండ పట్టణంలోని సిపిఐ (ఎంఎల్) న్యూడెమోక్రసీ (New democracy)జిల్లా కార్యాలయం శ్రామిక భవన్ లో ఎర్రజెండా ఎగురవేసి అమరవీ రులకు నివాళులు అర్పించారు.
ఈ సందర్భంగా సిపిఐ (ఎంఎల్) న్యూడెమోక్రసీ జిల్లా కార్యదర్శి ఇందూరు సాగర్,(Induru sagar)జిల్లా నాయకులు బొమ్మిడి నగేష్ లు మాట్లాడుతూ 1969, ఏప్రిల్ 22న సీపీఐ, సీపీఎం పార్టీలు అనుసరించిన రివిజనిస్ట్, నయా రివిజనిస్ట్ విధానాలను తిర స్కరించి చండ్ర పుల్లారెడ్డి, చారు మజుందార్,తరిమేల నాగిరెడ్డి, దేవులపల్లి ల నాయకత్వంలో సీపీ ఐ ఎంఎల్ పార్టీ ని స్థాపించారని అన్నారు.పిడుతుల పక్షాన నిలబడి దొరలు,పటేల్,భూస్వాములకు వ్యతిరేకంగా పోరాటం చేసినదని అన్నారు. జీతగాళ్ల సమ్మె,కూలిరేట్ల పెంపు,సారా వ్యతిరేక పోరాటాలు జరిగాయని, భూ పోరాటాల ద్వారా లక్షల ఎకరాల భూముల ను ప్రజల కు పంచిపెట్టిందని,పొడును గొట్టి గ్రామాలను నిర్మించిందని అన్నారు. ఈ క్రమంలో అనేక మంది విప్లవ కారులు పీడిత ప్రజలకోసం తమ ప్రాణాలను తృణప్రాయంగా త్యాగం చేశాలరని తెలిపారు. దేశంలో పీడి త ప్రజల విముక్తి సీపీఐ ఎంఎల్ ద్వారానే సాధ్యం అవుతుందని అన్నారు. కార్మికులు,(Workers) రైతులు ఐక్యంగా శ్రమ దోపిడీకి వ్యతిరేకంగా పోరాడి, సమసమాజ స్థాపనకై ముందుకు సాగాలని పిలుపు నిచ్చారు. ఈ కార్యక్రమంలో పి వై ఎల్ జిల్లా ప్రధాన కార్యదర్శి బి.వి చారి, ఐ ఎఫ్ టి యు జిల్లా,పట్టణ నాయకులు రావుల వీరేశ్,దాసరి నర్సింహ,జానపాటి శంకర్, బొమ్మ పాల అశోక్, కత్తుల లింగుస్వామి, మాగి క్రాంతి కుమార్, మహేష్, బాలాజీ తదితరులు పాల్గొన్నారు.
CPI MP emancipation for oppressed people