–సకల జనుల సమస్యల పరిష్కారం కోసం శాసనమండలిలో గొంతు వినిపిస్తాం
–సిపిఐ జాతీయ సమితి సభ్యులు పల్లా వెంకట రెడ్డి
CPI Palla Venkata Reddy : ప్రజాదీవెన నల్గొండ : సమాజంలో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలు పరిష్కరించడమే కమ్యూనిస్టుల ఎజెండా అని సిపిఐ జాతీయ సమితి సభ్యులు, మాజీ ఎమ్మెల్యే పల్లా వెంకటరెడ్డి అన్నారు. ఇటీవల కాలంలో ఎమ్మెల్యే కోటలో ఎమ్మెల్సీ గా ఎన్నికైన సిపిఐ జిల్లా కార్యదర్శి నెల్లికంటి సత్యo కు స్థానిక సిపిఐ కార్యాలయం మగ్దూమ్ భవన్ లో ఘనంగా సన్మానం చేశారు. సన్మాన కార్యక్రమానికి పల్లా వెంకటరెడ్డి ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడుతూ గత శాసనసభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీతో ఎన్నికల ఒప్పందం కుదిరించుకొని ఎన్నికలో సిపిఐ ఖమ్మం జిల్లాలోని కొత్తగూడెం నియోజకవర్గం నుంచి పోటీ చేయడం జరిగిందని, ఆ ఒప్పందం ప్రకారమే రెండు ఎమ్మెలు ఇస్తామన్న కాంగ్రెస్ ప్రభుత్వం ఈసారి మునుగోడు నియోజకవర్గానికి చెందిన నెల్లికంటి సత్యం కు ఎమ్మెల్సీ పదవి ఇవ్వడం జరిగిందని గుర్తు చేశారు. ఎమ్మెల్సీ పదవితో ఉమ్మడి నల్లగొండ జిల్లాతో పాటు రాష్ట్ర వ్యాప్తంగా సకల జనుల సమస్యల పరిష్కారం కోసం శాసనమండలిలో గొంతు వినిపించేందుకు కృషి చేయడం జరుగుతుంది అన్నారు. కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ముందు ప్రజలకు ఇచ్చిన హామీలు అమలు చేపించడానికి పనిచేస్తామన్నారు.
గత పది ఏండ్లుగా శాసనసభలో, శాసనమండలిలో పేదల పక్షన మాట్లాడే గొంతుక కమ్యూనిస్టులు లేకపోవడం వల్ల ప్రజా సమస్యలు పరిష్కరించలేదని నేడు శాసనసభలో, ఎమ్మెల్యే సీపీఐ రాష్ట్ర కార్యదర్శి సాంబశివరావు తో పాటు శాసన మండలి లో సిపిఐ జిల్లా కార్యదర్శి నెల్లికంటి సత్యం ఇద్దరు పేదల పక్షాన బలమైన వాణి వినిపిస్తారన్నారు. ముఖ్యంగా ఉమ్మడి నల్లగొండ జిల్లాలో ఎస్ఎల్బిసి, డిండి ఎత్తిపోతల పథకం , బ్రాహ్మణ వెల్లంల ప్రాజెక్ట్ తోపాటు మూసి పరివాహక ప్రాంతంలోని కాల్వలు పూర్తి చేయడంలో గత ప్రభుత్వం ఏడు ఎనిమిది సంవత్సరాల కాలం పాటు మాటలతో కాలం గడుపుతూ నిర్లక్ష్యానికి గురిచేశారని విమర్శించారు. గత ప్రభుత్వం మాదిరిగా కాకుండా రేవంత్ రెడ్డి ప్రభుత్వం ప్రాజెక్టుల పూర్తి కోసం సాంకేతికపరమైన అనుమతులు తీసుకొని పూర్తి చేయాలని లేని పక్షంలో ప్రభుత్వాన్ని ఒప్పించి, మెప్పించి అవసరమైతే పోరాటాలు చేస్తామన్నారు.
ప్రజల గొంతుకగా శాసనమండలిలో ప్రశ్నిస్తా..
ఎమ్మెల్సీ నెల్లికంటి సత్యం రాష్ట్రంలో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారం కోసం నాకు ఇచ్చిన అవకాశంతో శాసనమండలిలో ప్రజా గొంతుకగా శాసనమండల్లో ప్రశ్నిస్తానని సిపిఐ జిల్లా కార్యదర్శి ఎమ్మెల్సీ నెల్లికంటి సత్యం అన్నారు. ఉమ్మడి నల్గొండ జిల్లాలో నాటి నుంచి నేటి వరకు పీడిత, తాడిత, అనగారిన వర్గాల పేద ప్రజల పక్షాన కమ్యూనిస్టు పార్టీ పనిచేస్తుందని అదే స్ఫూర్తితో తాను కూడా పని చేస్తానన్నారు. నల్గొండ జిల్లా నుంచి రావి నారాయణరెడ్డి, బొమ్మగాని ధర్మబిక్షం, ఆరుట్ల రామచంద్ర రెడ్డి, కమలాదేవి, భీమిరెడ్డి నరసింహారెడ్డి, మల్లు స్వరాజ్యం, ఉజ్జుని నారాయణరావు, గుర్రం యాదగిరి రెడ్డి లాంటి యోధాను యోధులు ప్రజాప్రతినిధులుగా ప్రాతినిధ్యం వహించారని గుర్తు చేశారు. యోధానుయోధుల అనుభవాలు వాళ్ళ స్ఫూర్తితో జిల్లాలో కమ్యూనిస్టు పార్టీ కి పూర్వ వైభవం తీసుకొచ్చేందుకు తన వంతు కృషి చేస్తానన్నారు. కమ్యూనిస్టులకు పదవి కాదు వచ్చిన పదవితో బాధ్యతగా పని చేస్తారని ఆ అవకాశం తనకు రావడం సంతోషకరమన్నారు. జిల్లాలో ప్రజా సమస్యల తో పాటు కమ్యూనిస్టు పార్టీ బలోపేతం కోసం తన వంతు కృషి చేస్తానని తెలిపారు. సన్మాన కార్యక్రమానికి సిపిఐ జిల్లా సహాయ కార్యదర్శి పల్లా దేవేందర్ రెడ్డి అధ్యక్షత వహించగా రాష్ట్ర కార్యవర్గ సభ్యులు పల్లా నరసింహారెడ్డి, సీనియర్ నాయకులు ఉజ్జని రత్నాకర్ రావు, మల్లెపల్లి ఆదిరెడ్డి, జిల్లా సహాయ కార్యదర్శి లొడంకి శ్రవణ్ కుమార్, కార్యవర్గ సభ్యులు పబ్బు వీరస్వామి, బంటు వెంకటేశ్వర్లు, బలుగూరి నరసింహ, టి. వెంకటేశ్వర్లు, గురుజ రామచంద్రం, ప్రజానాట్యమండలి రాష్ట్ర అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు కురిమిద్దె శ్రీనివాస్, పల్లె నరసింహ, బీసీ హక్కుల సాధన సమితి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ధనంజయ నాయుడు, వివిధ మండల కార్యదర్శులు ఎండి. అక్బర్, జిల్లా యాదగిరి, లింగా నాయక్, సత్యనారాయణ, శాంతి సంఘం జిల్లా కార్యదర్శి జిల్లా యాదయ్య, బీసీ సంఘం జిల్లా అధ్యక్షులు దుర్గి లక్ష్మీనారాయణ, టిడిపి నాయకులు ఎల్వి యాదవ్, మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ లు చీర పంకజ్ యాదవ్, గుర్రం వెంకటరెడ్డి, మిర్యాల యాదగిరి, యూట్యూబ్ నాయకులు ఎడ్ల సైదులు, రిటైర్డ్ అధ్యాపకులు గుండబోయిన లింగయ్య యాదవ్, ప్రజాసంఘాల బాధ్యులు తదితరులు పాల్గొన్నారు.అనంతరo ఎమ్మెల్సీ గా ఎన్నికైన నెల్లికంటి సత్యం ను సిపిఐ పార్టీనాయకులు ప్రజాసంఘాలతో పాటు కుల సంఘాలు, ఉపాధ్యాయ కార్మిక, మెడికల్ కార్మిక ఉద్యోగ సంఘాల ఆధ్వర్యంలో పుష్పగుచ్చలు అందజేసి శాలువాలతో ఘనంగా సన్మానం చేశారు.