Welcome To Praja Deveena News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alert at prajadeveena.com

CPI public meeting: 30న నల్లగొండలో జరిగే సిపిఐ బహిరంగసభ విజయవంతం చేయాలి సిపిఐ 100 వసంతాల ఉత్సవాల కరపత్రం విడుదల

ప్రజాదీవెన, నల్గొండ టౌన్ : సామ్రాజ్యవాదానికి వ్యతిరేకంగా భూస్వామ్య పెట్టుబడిదారి విధానం వ్యతిరేకంగా 100 సంవత్సరాల కాలంగా అనేక పోరాటాలకు నాయకత్వం వహించి సుదీర్ఘ పోరాట చరిత కలిగిన పార్టీ సిపిఐ అపార్టీ జాతీయ సమితి సభ్యులు,మాజీ ఎమ్మెల్యే పల్లా వెంకట రెడ్డి అన్నారు. నల్లగొండ జిల్లా కేంద్రంలోని మగ్దూమ్ భవనంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో సిపిఐ వంద వసంతాల బహిరంగ సభ కరపత్రం ను విడుదల చేశారు. ఈసందర్బంగా వెంకట రెడ్డి మాట్లాడుతూ 1925డిసెంబర్ 26న కన్పూర్ లో భారత కమ్యూనిస్టు పార్టీగా ఆవిర్భావిoచి దేశంలో కష్టజీవుల పక్షాన కార్మిక,రైతాంగ, మహిళా,విద్యార్థి,యువజన హక్కుల కోసం నిరంతరం పోరాట నిర్వహిస్తూ ఆర్థిక అసమానతలు లేని సోషలిస్టు సమాజం కోసం అనేక త్యాగాలతో నిర్మితమైన పార్టీ సిపిఐ అన్నారు.

అదేవిదంగా కమ్యూనిస్టు పార్టీ చీలిక వలన కమ్యూనిస్టు లకు కొంత నష్టం జరిగిన ప్రజల హక్కుల కోసం సమరశీల పోరాటాలు నిర్వహిస్తుందన్నారు. 100 సంవత్సరాల సందర్బంగా చిలిపోయిన కమ్యూనిస్టు లు ఐక్యత అయితే పాలక పార్టీలకు ప్రత్యామ్నాయ పార్టీ గా ఉండబోతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. సిపిఐ 100 వసంతాల బహిరంగ సభ నల్లగొండ జిల్లా కేంద్రంలోని ఎన్ జి కళాశాల మైదానంలో ఈనెల 30 న నిర్వహించడం జరుగుతుందని తెలిపారు .సిపిఐ జిల్లా కార్యదర్శి నెల్లికంటి సత్యం మాట్లాడుతూ సిపిఐ 100 వసంతాల సందర్భంగా సిపిఐ బహిరంగ సభకు జిల్లా వ్యాప్తంగా అన్ని ప్రాంతాలలో ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. నల్లగొండ జిల్లా తెలంగాణ రైతంగా సాయుధ పోరాటం వారసత్వ ఉద్యమాల ఖిల్లా అన్నారు. సందర్బంగా డిసెంబర్ 30న జరిగే సిపిఐ బహిరంగ సభకు సిపిఐ శ్రేణులతో పాటు కమ్యూనిస్టు అభిమానులు నూతన ఉత్తేజంతో తరలి రావడానికి సిద్ధంగా ఉన్నారన్నారు.

జమిలి మోదీ నియంతృత్వానికి నిదర్శనం,దేశంలో ప్రజలను జమ్మికులు చేసే మూడోసారి అధికారంలోకి చేపట్టిన మోడీ ప్రభుత్వం మళ్లీ జమిలి ఎన్నికల నిర్వహించాలని పార్లమెంట్లో బిల్లు తీసుకురావడానికి సిపిఐ తీవ్రంగా వ్యతిరేకిస్తుందని సిపిఐ జాతీయ సమితి సభ్యులు, మాజీ ఎమ్మెల్యే పల్లా వెంకటరెడ్డి అన్నారు. కేంద్రంలో అధికారంలో ఉన్న మోడీ ప్రభుత్వం రాష్ట్రాల స్వయం ప్రతిపత్తిని ధ్వంసం చేయడం కోసమే ఒకే దేశం ఒకే ఎన్నిక అనే అంశాన్ని తెరమీద తీసుకురావడం జరిగిందన్నారు.

బిజెపి అధికారంలోకి వచ్చిన తర్వాత మతోన్మాద విధానాలను అమలు చేయడమే కాకుండా రాష్ట్రంలో పరిపాలన చేస్తున్న బిజెపి తర ప్రభుత్వాలను పడగొట్టి తమ ప్రభుత్వ ఏర్పరచుకునేందుకు అనేక కుట్రలు చేయడం జరిగిందని ఈ నేపథ్యంలో జెమిలి ఎన్నికలు ఎలా నిర్వహిస్తారని ప్రశ్నించారు. దేశంలో ఇండియాకుటంలోన అన్ని పార్టీలతో పాటు సిపిఐ కూడా జమిలి ఎన్నిక బిల్లు ను వ్యతిరేకిస్తుందని స్పష్టం చేశారు.విలేకరుల సమావేశంలో సిపిఐ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు పల్లా నర్సింహా రెడ్డి, సినియర్ నాయకులు మల్లేపల్లి ఆదిరెడ్డి ఉజ్జిని రత్నాకర్ రావు, జిల్లా సహాయ కార్యదర్శి లోడంగి శ్రవణ్ కుమార్, కార్యవర్గ సభ్యులు పబ్బు వీరస్వామి, ఆర్ అంజచారి, బంటు వెంకటేశ్వర్లు, బొల్గురి నర్సింహా, తీర్పారి వెంకటేశ్వర్లు, పట్టణ కార్యదర్శి గాదెపాక రమేష్, కె ఎస్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.