Welcome To Praja Deveena News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alert at prajadeveena.com

CPI: హామీల అమలులో కాంగ్రెస్ ప్రభుత్వం విఫలo

–సిపిఐ (ఎంఎల్) మాస్ లైన్ పార్టీ

CPI: ప్రజా దీవెన, కోస్గి: రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికల ముందు తెలంగాణ ప్రజల కు ఇచ్చిన హామీలను నెరవేర్చడం లో విఫలమైందని సిపిఐ(ఎంఎల్) (CPI)మాస్ లైన్ పార్టీ జిల్లా నాయకులు బి.యదగిరి బి.రాము విమర్శిం చారు. నారాయణపేట జిల్లా కోస్గి తాహసిల్దార్ కార్యాలయం ముందు సిపిఐ(ఎంఎల్)మాస్ లైన్ పార్టీ ఆధ్వర్యంలో కొత్త రేషన్ కార్డులు , కొత్త పెన్షన్లు, ఇందిరమ్మ ఇల్లను (New ration cards, new pensions, Indiramma houses)మంజూరు చేయాలని ధర్నా నిర్వహించారు. సిపిఐ(ఎంఎల్) మాస్ లైన్ పార్టీ డివిజన్ నాయ కులు ఎదిరింటీ,నర్సిములు అధ్యక్ష త వహించగా సిపిఐ(ఎంఎ ల్)మా స్ లైన్ పార్టీ జిల్లా నాయకులు బి. యాదగిరి బి.రాము హాజరైన ప్రజల ను ఉద్దేశించి వారు మాట్లాడుతూ గత సంవత్సరం డిసెంబర్లో ప్రజలకు అనేక వాగ్దానాలు ఇచ్చి అధికారం లోకి వచ్చిన ముఖ్యమంత్రి ఎను ముల రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ నా యకత్వంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు ఏడు నెలలు గడుస్తున్నా ఆరు గ్యారెంటీ లు అమలు చేయ లేదు. గత జనవరి నెలలో ఆరు నెలల క్రితం ప్రజా పాలన దరఖా స్తులను ప్రజలు సమర్పించారు. పేదలందరికీ కొత్త ఆసరా పింఛన్లను 4000, వికలాంగులకు 6000  పెం చి ఇస్తామని, అర్హులైన వారందరికీ రేషన్ కార్డులు ఇండ్లు ఇండ్ల స్థలాలు వ్యవసాయ కూలీలకు, సంవత్సరా నికి 12,000 జీవన భృతిని ఇస్తామ ని రైతు భరోసాని ఎకరానికి 15000 చొప్పున ఇస్తామని హామీ ఇచ్చారు నిరుద్యోగులకు జాబ్ క్యాలెండర్ ను ప్రకటిస్తామని, అందరికీ ఉద్యోగ అవకాశాలు కల్పిస్తామని హామీ ఇచ్చారు అనేక వాగ్దానాలను ఇచ్చి అధికారంలోకి వచ్చారు.

అనేకమం ది పేదలు ఇల్లు లేక సొంత స్థలాలు లేక గత 15 ఏళ్లుగా తీవ్ర ఇబ్బందు లకు గురవుతున్నారు ఇందిరమ్మ పథకంలో ఇల్లు మంజూరు చేస్తామ న్న ఒక్కో ఇంటి నిర్మాణానికి (House construction)ఐదు లక్షలు ఇస్తామన్న ప్రజాపాలనలో విస్తృతంగా దరఖాస్తులు తీసుకు న్నారు వాటి ఊసే లేకుండా ఉంది ఖరీఫ్ సీజన్ ప్రారంభమై మూడు నెలలు గడుస్తున్నది నేటికీ రైతు భరోసా రైతులకు అందలేదు ఎకరా నికి 15000 చొప్పున ఇస్తామని చెప్పిన వాగ్దానం నెరవేరలేదు ప్రభుvత్వము 10 ఎకరాల వరకు రైతు భరోసా తక్షణమే అందించాల ని డిమాండ్ చేశారు ఏకకాలంలో రెండు లక్షల రుణమాఫీ చేయాల న్నారు రేషన్ కార్డు ప్రాతిపదిక కాకుండా అన్ని అప్పులను రద్దు చేసి కొత్తపులను రైతులకు అందిం చాలన్నారు ప్రతి గ్రామంలో రైతు లను ధరణి లో భూ సమస్యలు పరిష్కారం కాక నేటికీ సతమత మవుతున్నారు ధరణిని రద్దు చేస్తాం అన్న రేవంత్ రెడ్డి (Revanth Reddy) మాటలు ఏమయ్యా అని  రైతులు నిలదీస్తు న్నారు జాబ్ కేలండర్ విడుదల కాలేదు నిరుద్యోగ ఖాళీలపై ప్రకటన రాలేదు శ్వేత పత్రాన్ని ప్రకటించి నిరుద్యోగులకు తక్షణమే జాబ్ క్యాలెండర్ను విడుదల చేయాలి నిరుద్యోగులందరికీ జీవన భృతి కల్పించా లని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.

కెసిఆర్ (kcr)ను గద్దెదించి ప్రజా ప్రభుత్వాన్ని ఏర్పా టు చేసి ప్రజలకు సమర్థవంతమైన ప్రజాపాలన అందిస్తామన్న రేవంత్ రెడ్డి మాటలు కోటలు దాటడం లేద ని ఎద్దేవా చేశారు వ్యవసాయ కార్మి కులకు కనీస వేతనం వారికి ఇస్తా మన్న 12000 పెన్షన్ను అమలు చేయాలని డిమాండ్ చేశారు విద్యా ర్థుల ఫీజు రీయింబర్స్ బకాయిలను ఆరోగ్యశ్రీ బకాయిలను తక్షణమే చె ల్లించాలన్నారు ప్రజల రైతుల సమ స్యల కోసం ఐక్యంగా పోరాటాలు చేయాలని పిలుపునిచ్చారు అం దుకు ఆగస్టు 8వ తారీఖున జిల్లా కలెక్టర్ కార్యాలయాల ముట్టడి మరియు ఆగస్టు 21న చలో హైద రాబాద్ కార్యక్రమం లో జరిగే ఆందో ళనలో పాల్గొనాలని విజ్ఞప్తి చేశారు. ధర్నా అనంతరం డిమాండ్స్ తో కూడిన విజ్ఞాపన పత్రాన్ని కోస్గి తాసిల్దార్ గారికి ఇవ్వడం జరిగింది. కార్యక్ర మంలో సిపిఎంఎల్ మాస్ లైన్ నాయకులు కొండన్న, కిష్టప్ప, బాలయ్య, మైబు, హనుమంతు, మొగులయ్య, మల్లేష్, రాములు, నర్సిములు, వెంకటయ్య, ఆంజ నేయులు, తదితరులు పాల్గొ న్నారు.