CPI: ప్రజా దీవెన, కోదాడ: కోదాడ మున్సిపల్ (Kodada Municipal)పరిధిలోని తమ్మర గ్రామానికి చెందిన సిపిఐ (CPI) నాయకురాలు యలమద్ది తులశమ్మ (90) సంవత్సరాలు శుక్రవారం తన నివాస గృహములో మృతి చెందారు ఆమెమృతి పట్ల సీపీఐ జిల్లా కార్యదర్శి బెజవాడ వెంకటేశ్వర్లు, మండల కార్యదర్శి బత్తినేని హనుమంతరావు తులశమ్మ మృతదేహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గత రెండు తరాలుగా తులశమ్మ కుటుంబ సిపిఐ పార్టీ పక్షాన ఉంటూ అనేక ఉద్యమాల్లో పాల్గొన్న విషయాన్ని గుర్తు చేశారు. తులశమ్మ మృతి (Death of Tulshamma)పార్టీకి తీరంలోటని వారి కుటుంబానికి పార్టీ అండగా ఉంటుందని కుటుంబ సభ్యులను ఓదార్చారు. నివాళులర్పించిన వారిలో ఏఐటీయూసీ నాయకులు మేకల శ్రీనివాసరావు, సిపిఐ తమ్మర శాఖ కార్యదర్శి మాతంగి ప్రసాద్ రైతు సంఘం రాష్ట్ర నాయకులు బొల్లు ప్రసాద్ ,నిడిగొండ రామకృష్ణ,కొండా కోటేశ్వరరావు, మాతంగి గాంధీ, కాటంరాజు ,తులసమ్మ కుమారులు నారాయణరావు వెంకటేశ్వర్లులు పూలమాలలు వేసి నివాళులర్పించారు.