–సిపిఎం డిమాండ్
CPM Demand : ప్రజాదీవెన నల్గొండ టౌన్ : జిల్లా మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి పేదల పట్ల నిర్లక్ష్యం విడనాడి పేదలైన డబుల్ బెడ్ రూమ్ లబ్ధిదారులకు వెంటనే ప్రొసీడింగ్ ఆడర్స్ ఇప్పించడం కోసం అధికారులకు ఆదేశాలు ఇవ్వాలని. సిపిఎం జిల్లా కమిటీ సభ్యులు ఎండి సలీం డిమాండ్ చేశారు. బుధవారం నల్లగొండ తహసిల్దార్ కార్యాలయం ముందు డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల సాధనా కమిటీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న రిలే నిరాహార దీక్షలు మూడవరోజు కొనసాగాయి. ఈ సందర్భంగా సలీం మాట్లాడుతూ నల్లగొండ నియోజకవర్గంలో ఇప్పటికీ ఐదు సార్లు ఎమ్మెల్యేగా, మంత్రిగా గెలిచి నలగొండ నియోజకవర్గంలో పేద ప్రజల విషయంలో ఎక్కడ కూడా పేద ప్రజలకు గంటెడు జాగా ఇవ్వ లేదని అన్నారు.
ఇప్పటికైనా మంత్రి నియోజకవర్గ కేంద్రంలో నిర్మించిన 552 డబల్ బెడ్ రూమ్ ఇండ్లు లాటరీ ద్వారా ఎంపికైన లబ్ధిదారులకు వెంటనే పట్టాలు ఇవ్వడం కోసం అధికారులకు ఆదేశాలు ఇచ్చి తన నిజాయితీని నిరూపించుకోవాలని కోరారు. గత మూడు రోజులుగా నల్లగొండ పట్టణంలో ఎమ్మార్వో కార్యాలయం ముందు లాటరీ ద్వారా ఎంపికైన డబుల్ బెడ్ రూమ్ లబ్ధిదారులను ఎంపిక చేసిన వారికి ఇండ్లను స్వాధీన పరచకుండా అటు అధికార పార్టీ నాయకులు, ఇటు అధికారులు పేదల పట్ల చాలా నిర్లక్ష్యంగా ఉన్నారనేది అర్థమవుతుందని అన్నారు. వెంటనే జిల్లా కలెక్టర్, ఆర్డీవో ఎంపికైన డబుల్ బెడ్ రూమ్ లబ్ధిదారులకు ప్రోసిడింగ్ ఇవ్వడం కోసం తాసిల్దార్ కు ఆదేశాలు ఇయ్యాలని డిమాండ్ చేశారు.లేనిపక్షంలో 25వ తారీకు నాడు ఎమ్మార్వో కార్యాలయం ముట్టడించి ప్రొసీడింగ్ ఇచ్చేవరకు మా పోరాటం కొనసాగిస్తామని అధికారులను హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో సిపిఎం పట్టణ కార్యదర్శి దండంపెల్లి సత్తయ్య, డబుల్ బెడ్ రూమ్ పోరాట సాధన కమిటీ కన్వీనర్ అవుట రవీందర్, సిపిఎం పార్టీ పట్టణ కమిటీ సభ్యులు భూతం అరుణకుమారి, గుండాల నరేష్, దీక్షలో కూర్చున్న డబుల్ బెడ్ రూమ్ పోరాట కమిటీ సభ్యులు బి. సరోజ, కోటమ్మ, నసీం బేగం, జానిబి అలీ, షహనాజ్ బేగం, షఫీ తదితరులు పాల్గొన్నారు.